Samantha | యశోద ఫస్ట్‌గ్లింప్స్ రిలీజ్...సర్‌ప్రైజింగ్‌గా సమంత క్యారెక్టర్
సమంత అభిమానులను యశోద టీమ్ సర్‌ప్రైజ్ చేసింది. గురువారం ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి హరీ-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ప్రయోగాలకు ప్రాముఖ్యతనిస్తోంది సమంత. ఆమె కథానాయికగా నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం యశోద. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీ-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను గురువారం విడుదలచేశారు. ఇందులో సమంత ప్రెగ్నెంట్ పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ఓ హాస్పిటల్ లో బెడ్ పై నుంచి హఠాత్తుగా మేల్కొని తన డ్రెస్ తో పాటు చేతికున్న బ్యాండ్ ను సమంత చూసుకోవడం ఆసక్తిని పంచుతోంది. కిటికి బయట ఉన్న పావురాన్ని ఆమె పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఈ గ్లింప్స్ లో చూపించారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ లో వస్తోన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉత్కంఠను పంచుతోంది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో సమంత అభిమానులను ఆకట్టుకుంటోంది.
థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్‌బెన్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. భాగమతి ఫేమ్ ఉన్నిముకుందన్ మేల్‌లీడ్‌గా కనిపించబోతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం