RRR | ముంబైలోనూ రామ్‌చరణ్‌కు ఇంత క్రేజా.. చుట్టుముట్టేసిన ఫ్యాన్స్
RRR మూవీతో మరో ఇద్దరు తెలుగు స్టార్లను పాన్ ఇండియా స్టార్లుగా మార్చేశాడు దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. ఇప్పుడు రామ్‌చరణ్‌కు కూడా ప్రభాస్ రేంజ్‌లోనే ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ ఉండటం విశేషం.
ముంబై: ట్రిపుల్ ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం, ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించింది. ఇంకా సృష్టిస్తూనే ఉంది. ఈ మూవీ దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలైపోయాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిందీ సినిమా. రెండో వారంలోకి ఎంటరైనా వసూళ్లలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఈ మూవీలో నటించిన తెలుగు స్టార్లు కాస్తా ఒక్క మూవీతో పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.
తాజాగా రామ్‌చరణ్‌కు ఎదురైన అనుభవమే దీనికి నిదర్శనం. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో కనిపించిన చెర్రీ.. ఆదివారం ముంబై వెళ్లాడు. వ్యక్తిగత పని మీద అక్కడికి వెళ్లిన రామ్‌చరణ్‌కు ఎయిర్‌పోర్ట్‌లోనే అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప మాల వేసుకున్న అతడు నల్లటి లుంగీ, షర్ట్ వేసుకొని కనిపించాడు. అతన్ని ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు తీసుకురావడానికి సెక్యూరిటీ సిబ్బంది చాలానే కష్టపడాల్సి వచ్చింది.
ఈ మెగా పవర్‌స్టార్ ఆ తర్వాత ఈ మూవీకి ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి బాంద్రాలోని ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కు వెళ్లాడు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిన అతడు.. అక్కడి ఆడియెన్స్‌తో కలిసి చివరి అరగంట మూవీని చూశాడు. అక్కడ కూడా వందలాది మంది ఫ్యాన్స్ అతన్ని చుట్టుముట్టారు. షో ముగియగానే చరణ్ అక్కడికి వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్.. అతని కారు చుట్టూ చేరి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. చెర్రీ తమ థియేటర్‌కు వచ్చే విషయమే తనకు తెలియదని, వచ్చిన తర్వాత కూడా ఎలాంటి వీఐపీ ట్రీట్‌మెంట్ కోరకుండా సాధారణ అభిమానుల్లాగే ఓ సీట్లో కూర్చొని సినిమా చూశాడని థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ చెప్పాడు.
మూవీ చూసిన తర్వాత రామ్‌చరణ్.. ముంబైలోని తన ఫేవరెట్ రెస్టారెంట్ అయిన మిజులో డిన్నర్ చేశాడు. అతడు ఎప్పుడు ముంబై వచ్చినా ఈ రెస్టారెంట్‌కు కచ్చితంగా వెళ్తాడు. అయితే ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ట్రిపుల్ ఆర్ హిందీలోనూ దుమ్ము రేపడంతో చెర్రీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీంతో ఇక నుంచి అతను ఇండియాలో ఎక్కడికెళ్లినా ఈ రేంజ్ ఫాలోయింగ్ తప్పేలా లేదు.
సంబంధిత కథనం
టాపిక్