RRR Viral: ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్.. రామాయణం నుంచి స్ఫూర్తి పొందారా? -rrr movie climax narrated by chaganti koteswara rao and video goes to viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Viral: ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్.. రామాయణం నుంచి స్ఫూర్తి పొందారా?

RRR Viral: ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్.. రామాయణం నుంచి స్ఫూర్తి పొందారా?

Maragani Govardhan HT Telugu
Jun 25, 2022 04:25 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ ఫైట్‌కు పేరడి వీడియోగా చాగంటి మాటలను జత చేసి ఫర్పెక్టుగా ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో విశేషంగా స్పందిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్
ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ (Twitter)

దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమా తెరకెక్కించిన ఆ చిత్రం హిట్ అవ్వడం పక్కా.. అని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. బాహుబలితో ప్రభంజనం సృష్టించిన రాజమౌళి ఉత్తరాది ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఆయన నుంచి ఈ ఏడాది వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది. అబ్బుర పరిచే విజువల్స్, కథకు తగిన భావోద్వేగాన్ని మిళతం చేయడం మన జక్కన్న దిట్ట. అందుకే హాలీవుడ్ స్టార్లు, రచయితలు, డైరెక్టర్ల సైతం ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సాధారణంగా పురాణాలు, ఇతిహాసాల నుంచి ఇన్‌స్పైర్ పొందే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కూడా రామాయణం నుంచి స్ఫూర్తి పొందినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్‌చల్ చేస్తోంది. రామాయణంలో రాముడు, హనుమంతుడి భుజాలపై ఎక్కి రావణ సంహారం చేసే ఘట్టాన్ని మన జక్కన్న రామ్ చరణ్, తారక్‌పై తెరకెక్కించినట్లు ఫ్యాన్ మేడ్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు రామాయణ మాటలను జోడించి వీడియోను రూపొందించారు.

రామ్ చరణ్, తారక్ చేసే క్లైమాక్స్ ఫైట్‌కు చాగంటి మాటలను పేరడిగా చేసి ఫర్ఫెక్టుగా ఎడిట్ చేశాడు ఓ అభిమాని. అంతటితో ఆగకుండా ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసే ఫైట్ బ్యాక్ డ్రాప్‌లో రామ, రావణ యుద్ధం ప్రవచనాన్ని చాగంటి వినిపించారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్