Kantara Movie Telugu Release Date: తెలుగులో రిలీజ్ అవుతోన్న కాంతారా - థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే-rishab shetty kantara telugu version to hit the screens on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rishab Shetty Kantara Telugu Version To Hit The Screens On This Date

Kantara Movie Telugu Release Date: తెలుగులో రిలీజ్ అవుతోన్న కాంతారా - థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Oct 09, 2022 10:42 AM IST

Kantara Telugu Release Date:క‌న్న‌డ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంతారా సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూష‌న్ ద్వారా అల్లు అర‌వింద్ ఈసినిమాను తెలుగులో విడుద‌ల‌చేస్తున్నారు. కాంతారా రిలీజ్ డేట్‌ను ఆదివారం వెల్ల‌డించారు.

కాంతారా
కాంతారా (Twitter)

Kantara Movie Telugu Release Date: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన క‌న్న‌డ చిత్రం కాంతారా బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. విలేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే 55 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌న్న‌డ‌ అగ్ర హీరోల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది.

గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూష‌న్ ద్వారా అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ ఈ సినిమాను తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. ఈ నెల 15న కాంతారా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించాడు. కాంతారా అంటే సంస్కృత భాష‌లో అడ‌వి అని అర్థం. ప్రేమ‌ను చూపిస్తే అంత‌కుమించి ప్రేమ‌ను, విధ్వంసాన్ని సృష్టిస్తే అంత‌కుమించిన విధ్వంసాన్ని రిట‌ర్న్ గిఫ్ట్‌గా అడ‌వి ఇస్తుంద‌నే పాయింట్‌తో కాంతారా సినిమా రూపొందింది.

హీరోగా న‌టిస్తూనే కాంతార సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హంచాడు రిష‌బ్ శెట్టి. తెలుగు ట్రైల‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌కు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంటా...అత‌ను ఏదో ఒక రాయి కోసం విశాల‌మైన‌భూమిని త‌న ఊరివాళ్ల‌కు ఇచ్చాడ‌ట అనే డైలాగ్‌తో ఈ ట్రైల‌ర్ మొద‌లైంది. పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ ట్రైల‌ర్ క‌నిపిస్తోంది. ఫారెస్ట్ ఆఫీస‌ర్స్‌తో శివ చేసే పోరాటాన్ని యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ అంశాల‌తో సినిమాలో ఆవిష్క‌రించారు. భ‌క్తిని మిక్స్ చేశారు.

కేజీఎఫ్ ఫేమ్‌ హోంబ‌లే ఫిల్మ్స్ క‌న్న‌డంలో ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో కిషోర్‌, స‌ప్త‌మి, అచ్యుత్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అజ‌నీష్ లోక‌నాథ్ సంగీతాన్ని అందించాడు.

IPL_Entry_Point