RC16: శ్మశానం అనగానే భయమేసింది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. RC16 డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్
Buchi Babu About Geethanjali Malli Vachindi: రామ్ చరణ్‌తో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న సినిమా RC16. ఇటీవల గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Buchi Babu At Geethanjali Malli Vachindi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చి బాబు సాన తెరకెక్కిస్తున్న మూవీ RC16. భారీ అంచనాలతో నిర్మాణం కానున్న ఈ సినిమాకు నటీనటులు కావాలంటూ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్ వేడుకకు డైరెక్టర్ బుచ్చిబాబు సాన అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు డైరెక్టర్లు బాబీ, గోపీచంద్ మలినేని, హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్‌లో బుచ్చి బాబు చేసిన కామెంట్స్ అక్కడున్న వాళ్లను నవ్వేలా చేశాయి. "కోన వెంకట్ గారు ఈ ఈవెంట్ గురించి చెబుతూ వేదిక శ్మశానం అని చెప్పారు. నాకు భయం వేసింది. ఆ తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేదిక మార్చాం అని మళ్లీ వాయిస్ మెసెజ్ పెట్టారు. కోన వెంకట్ గారి పేరు కనిపిస్తే సినిమా ఇంపాక్ట్ ఓ లెవెల్లో ఉంటుంది. ఆయన రాసిన డైలాగ్స్‌ను ఇంటికి పట్టుకెళ్తాం. ఎంతో లాజిక్స్‌గా పంచ్‌లు ఉంటాయి. పదేళ్ల క్రితం గీతాంజలితో నవ్వించారు. భయపెట్టారు. మళ్లీ ఇప్పుడు రాబోతోన్నారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్" అని బుచ్చిబాబు అన్నారు.
అయితే, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ లాంచ్‌ను మొదట బేగంపేట శ్మశానంలో చేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్, మీమ్స్ వచ్చేశాయి. దాంతో సినిమా టీమ్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వేదికను మార్చినట్లు తెలుస్తోంది. కాగా గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ లాంచ్‌కి మరో గెస్టుగా హాజరైన హీరో శ్రీ విష్ణు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"కోన వెంకట్ గారితో గత ఏడాది నుంచి పని చేస్తున్నాను. త్వరలోనే ఆయనతో ఓ చిత్రాన్ని చేస్తున్నాను. కథ మీద ఎక్కువగా దృష్టి పెడతారు. తొందర పెట్టరు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ ఇలా అందరూ నాకు కావాల్సిన వాళ్లు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. దర్శకుడికి మంచి పేరు రావాలి. మార్చి 22న థియేటర్లో అందరినీ నవ్విస్తూ, భయపెట్టి కలెక్షన్లు కొల్లగొట్టాలని కోరుకుంటున్నాను" అని హీరో శ్రీ విష్ణు అన్నారు.
"అంజలి గారు 50 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించడం గర్వంగా ఉంది. ఇంకా వంద, 150 ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. నందు, భాను టాప్ రైటర్లు కాబోతోన్నారు. మార్చి 22న ఓం భీం బుష్ కూడా రాబోతోంది. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్లను సాధించాలి" అని శ్రీ విష్ణు కోరారు. ఇదిలా ఉంటే 2014లో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన గీతాంజలి మూవీకి గీతాంజలి మళ్లీ వచ్చింది అనేది సీక్వెల్.
గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీవీ సినిమాస్ బ్యానర్స్‌పై కోన వెంకట్ నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 22న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను శనివారం (ఫిబ్రవరి 24) రిలీజ్ చేశారు.