SS Rajamouli | రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?-raviteja is the only hero who dominated rajamouli direction ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ss Rajamouli | రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?

SS Rajamouli | రాజమౌళి డైరెక్షన్​ను డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Jan 24, 2022 09:22 PM IST

మన జక్కన్న తీసిన ప్రతి సినిమాకు సంగీత సారథ్యం వహించిన రాజమౌళి గురించి ఎంఎం కీరవాణి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి చిత్రం ఏదో ఒక విభాగం డామినేట్ చేస్తుందని, కానీ ఆయన డైరెక్షన్​ను కూడా డామినేట్ చేసిన హీరో ఒకరున్నారని కీరవాణి అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

<p>రాజమౌళి&nbsp;</p>
రాజమౌళి (Hindustan times)

SS Rajamouli.. బాహుబలి చిత్రంతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన డైరెక్టర్ రాజమౌళి. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశమొస్తే గోల్డెన్ ఛాన్స్​గా హీరోలు భావిస్తారు. ఇటీవలే మన జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్​ విడుదలైంది. అంతేకాకుండా ఇది సినీ ప్రియుల్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిత్రబృందం టాలివుడ్, బాలివుడ్, కోలివుడ్ అనే భేదం లేకుండా సినిమా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో మన జక్కన్న తీసిన ప్రతి సినిమాకు సంగీత సారథ్యం వహించిన ఎంఎం కీరవాణి.. రాజమౌళి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి చిత్రం ఏదో ఒక విభాగం డామినేట్ చేస్తుందని, కానీ ఆయన డైరెక్షన్​ను కూడా డామినేట్ చేసిన హీరో ఒకరున్నారని కీరవాణి అన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

ఆ హీరో ఇంకెవరో కాదు మన మాస్ మహారాజా రవితేజ. విక్రమార్కుడు సినిమా మొత్తాన్ని రవితేజ తన నటనతో డామినేట్ చేశారని చెప్పారు. " రాజమౌళి సినిమాలన్నింటిలో కొన్ని విభాగాలు సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఉదాహరణకు 'స్టూడెంట్ నెం.1'లో సంగీతం, 'సింహాద్రి'లో కథ, 'సై'లో డైరెక్షన్, ఇలా పలు విభాగాలు సినిమాకు తగినట్లు డామినేట్ చేస్తాయి. కానీ విక్రమార్కుడు మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నం. హీరో రవితేజ సినిమా మొత్తాన్ని డామినేట్ చేశాడు. చిత్రంలో పూర్తిగా తన నటనతో ఆధిపత్యాన్ని చెలాయించాడు" అని జక్కన్న చిత్రాల గురించి కీరవాణి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

2006లో రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సూపర్ డూపర్ హిట్టయింది. అంతేకాకుండా హిందీ, తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లో రీమేక్​ అవ్వడమే కాకుండా అక్కడ కూడా సంచలన విజయాన్ని సాధించింది. విక్రమార్కుడులో రవితేజ అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోర్ అనే రెండు పాత్రలను పోషించాడు. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం అప్పట్లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్ హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్​దేవగణ్, సముద్రఖని, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. అల్లూరి సీతరామరాజుగా చరణ్, కొమురం భీమ్​గా ఎన్టీఆర్ నటించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో డీవీవీ దానయ్య ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Whats_app_banner