Ravi Babu Asalu Movie: ఈ టీవీ విన్ ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే
Ravi Babu Asalu Movie:ఈ టీవీ విన్ ఓటీటీలో థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...
Ravi Babu Asalu Movie: కరోనా తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు క్రేజ్ పెరగడంతో డైరెక్ట్‌గా స్టార్ హీరోల సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవుతోన్నాయి. తాజాగా ఈ టీవీ విన్ ఓటీటీలో థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా రెండు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు రవిబాబు నటిస్తూ నిర్మించినఅసలు సినిమా ఏప్రిల్ 5వ తేదీన ఈ టీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఓ ప్రొఫెసర్ మర్డర్ చుట్టూ ఈ సినిమా సాగినట్లుగా ట్రైలర్‌లో కనిపిస్తోంది.
అసలు సినిమాతో పాటు రైటో లెఫ్టో సినిమా మార్చి 22న ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు కూరపాటి వేణుగోపాల్ దర్శకత్వం వహించబోతున్నాడు. ముగ్గురు యువకుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.
ఈ రెండు సినిమాలతో పాటుగా బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన పంచతంత్రం మార్చి 22న రిలీజ్ కానుంది. ఐదు కథల సమాహారంగా రూపొందిన ఈసినిమాకు హర్ఫ పులిపాక దర్శకత్వం వహించాడు.