Raveena Tandon: నా జీవితం పూలపాన్పు కాదు...వేధింపులపై రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీనేజ్ ఏజ్ లో తాను ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పింది బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. ఈవ్ టీజింగ్ కు గురైనట్లు చెప్పింది. తనకు ఎదురైన వేధింపులపై రవీనా టాండన్ సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టీనేజ్ ఏజ్ లో తాను ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ వ్యాఖ్యానించింది. తన జీవితం పూలపాన్పు కాదని, తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నది. మెట్రో కార్ షేడ్ ను ముంబై నగరం నుండి ఆరే అటవీ ప్రాంతానికి తరలించాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై రవీనా టాండన్, దియా మీర్జా, పర్హాన్ అక్తర్, శ్రద్ధాకపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం వృక్ష సంపదను నాశనం చేస్తున్నదంటూ విమర్శల్ని కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రవీనా టాండన్ కు ముంబై మధ్యతరగతి కష్టాలు తెలుసా అంటూ ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్ పై రవీనా టాండన్ ఘాటుగా స్పందించింది. సినిమాల్లోకి రాకముందు తాను చాలా రోజులు లోకల్ ట్రైన్స్, బస్ లలో ప్రయాణించానని, ఆ సమయంలో ఈవ్ టీజింగ్ తో పాటు వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పింది.
బస్, ట్రైన్స్ లో ప్రయాణించే చాలా మంది మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా అనుభవించినట్లు తెలిపింది. ఈ వేధింపుల నుండి బయటపడేందుకే 1992లో తొలి కారు కొనుక్కున్నట్లు చెప్పింది. ఎన్నో కష్టాలు, అవరోధాలను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకున్నానని రవీనా టాండన్ పేర్కొన్నది. అభివృద్ధి మంచిదే కానీ దాని పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని చెప్పింది. అడవులను, వన్య ప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పింది. రవీనా టాండన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏప్రిల్ నెలలో విడుదలైన కేజీఫ్ 2 సినిమాలో రమికా సేన్ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
టాపిక్