Raveena Tandon in trouble: పులికి దగ్గరగా వెళ్లిన బాలీవుడ్ నటి.. ప్రభుత్వం సీరియస్
Raveena Tandon in trouble: పులికి దగ్గరగా వెళ్లిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సాత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్‌లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరికి వెళ్లడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది.
Raveena Tandon in trouble: కొన్నిసార్లు సోషల్ మీడియా పోస్ట్‌లు చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. తమ అనుభవాలను అభిమానులతో పంచుకోవాలన్న ఉద్దేశంతో సెలబ్రిటీలు పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలు వాళ్లనే డేంజర్‌లో పడేస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ నటి రవీనా టాండన్‌కు ఇదే అనుభవమైంది.
ఆమె మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో సఫారీ టూర్‌కు వెళ్లింది. అక్కడ ఓ పులి కనిపించే సరికి దానిని వీడియోలు, ఫొటోలు తీసింది. ఈ క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం దానికి దగ్గరగా వెళ్లింది. ఇలా వెళ్లడం ఆమెను థ్రిల్‌కు గురి చేసిందేమో కానీ.. అటు అధికారుల ఆగ్రహానికి కూడా కారణమైంది. ఈ ఘటనపై అక్కడి అధికారులు విచారణ ప్రారంభించారు.
రవీనా వాహనం పులికి దగ్గరగా వెళ్లిన సమయంలో అది గాండ్రించడం కూడా వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డీవో) ఆఫ్ ఫారెస్ట్ వెల్లడించారు. నవంబర్ 22న రవీనా టాండన్ తబోడాకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్, అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారు.
నవంబర్ నెల మొదట్లోనూ ఓ ట్వీట్ ద్వారా రవీనా వార్తల్లో నిలిచింది. భోపాల్‌లో వన్ విహార్ నేషనల్ పార్క్‌లో కొందరు పులి ఉన్న ఎన్‌క్లోజర్‌పై రాళ్లు విసురుతున్న ఘటనను రిపోర్ట్ చేసింది. దీనిపై అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని ఎంతగానో ఇష్టపడే రవీనా.. తరచూ ఇలాంటి సఫారీలకు వెళ్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటుంది.
టాపిక్