Bigg Boss 6 Telugu Raj Eliminated: బిగ్‌బాస్ నుంచి రాజ్ ఎలిమినేట్ - ఎవిక్షన్ పాస్‌తో ఫైమా సేఫ్
Bigg Boss 6 Telugu Raj Eliminated: ఈ వారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో ఫైమా, రాజ్ మిగలగా ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకొని ఫైమా సేవ్ అయ్యింది.
Bigg Boss 6 Telugu Raj Eliminated: బిగ్‌బాస్ 6 తెలుగు నుంచి ఈ వారం రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. నామినేషన్స్‌లో చివరగా ఫైమా, రాజ్ మాత్రమే మిగిలారు. అయితే ఫైమా వద్ద ఎవిక్షన్ పాస్ ఫ్రీ పాస్ ఉండటంతో ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యింది. ఈ ఎవిక్షన్ పాస్‌ను నువ్వు వాడుకోవచ్చు లేదంటే రాజ్ కోసమైనా వాడొచ్చు అని ఫైమాతో నాగార్జున చెప్పాడు. పాస్ ఉపయోగించుకోకపోతే అది వేస్ట్ అవుతుంది, ఆడియెన్స్ ఓటింగ్ ఆధారంగా ఎవరు తక్కువలో ఉంటే వారు ఎలిమినేట్ అవుతారని తెలిపాడు.
కంటెస్టెంట్స్ ఓటింగ్...
ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకునే విషయంలో కంటెస్టెంట్స్ ఓటింగ్ కోరాడు నాగార్జున. అందరూ ఫైమా వాడుకోవడమే బెటర్ అని సజేషన్ ఇచ్చారు. రాజ్ కూడా ఫైమా కష్టపడి ఆడింది కాబట్టి ఆమెనే ఈ పాస్ వాడుకోవాలని అన్నాడు. కానీ రాజ్ కోసం పాస్ వాడటానికి ఫైమా రెడీ అయ్యింది. రాజ్‌ను సేవ్ చేయడానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ఆడినట్లు తెలిపింది.
నాగార్జున మాత్రం ఆమె మాటలతో కన్వీన్స్ కాలేదు. ఫైమా మదర్ కూడా ఆమెనే ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. నాగ్ మాటలతో చివరకు ఎవిక్షన్ పాస్‌ను తానే ఉపయోగించుకుంటానని ఫైమా చెప్పింది. ఓటింగ్ పరంగా ఫైమా బాటమ్ లిస్ట్‌లో ఉంది. కానీ ఎవిక్షన్ పాస్‌తో ఆమె సేవ్ అయ్యింది.
ఎమోషనల్ అయిన రాజ్...
హౌజ్ నుంచి వెళ్లిపోతుండటంతో రాజ్ ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చేశాడు. అతడిని అందరూ ఓదార్చారు. హౌజ్ నుంచి వెళ్లిపోతున్న అతడికి ఇనాయా సారీ చెప్పింది. స్టేజ్‌పైకి వచ్చిన రాజ్ ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం తాను గెలిచానని, కానీ ఎవిక్షన్ పాస్ వల్లే ఎలిమినేట్ కావాల్సివచ్చిందని అన్నాడు.
రేవంత్ ప్రామిస్...
రాజ్ కు హగ్ ఎవరికి, పంచ్ ఎవరిని అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో హగ్ ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్‌లకు ఇచ్చాడు. పంచ్ శ్రీహాన్, కీర్తి, ఇనాయా, శ్రీసత్యకు ఇచ్చాడు. రాజ్ మాట్లాడుతున్న తరుణంలో ఫైమా ఏడ్చేసింది. ఫైమా గేమ్‌లో ఫన్ మిస్ అవుతుందని రాజ్ అన్నాడు.
రోహిత్ చాలా మంచోడని పేర్కొన్నాడు. రేవంత్‌ది చిన్న పిల్లాడి మనస్తత్వమని చెప్పాడు. రాజ్ మాటలకు నీ ఆట కూడా నేను ఆడుతానని రేవంత్ ప్రామిస్ చేశాడు. శ్రీహాన్ కొన్ని విషయాల్ని గట్టిగా మాట్లాడలేనని అన్నాడు. ఇనాయా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని రాజ్ సలహా ఇచ్చాడు.