Raasi Re Entry: టాలీవుడ్‌లోకి రాశి రీఎంట్రీ - రాఘ‌వ‌రెడ్డి ట్రైల‌ర్ రిలీజ్‌-raasi re entry into tollywood with raghava reddy movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raasi Re Entry: టాలీవుడ్‌లోకి రాశి రీఎంట్రీ - రాఘ‌వ‌రెడ్డి ట్రైల‌ర్ రిలీజ్‌

Raasi Re Entry: టాలీవుడ్‌లోకి రాశి రీఎంట్రీ - రాఘ‌వ‌రెడ్డి ట్రైల‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 21, 2023 08:24 PM IST

Raasi Re Entry: సీనియ‌ర్ హీరోయిన్ రాశి… రాఘ‌వ‌రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ గురువారం రిలీజైంది.

రాఘ‌వ‌రెడ్డి సినిమా
రాఘ‌వ‌రెడ్డి సినిమా

Raasi Re Entry: తెలుగులో గోకులంలో సీత‌, శుభాకాంక్ష‌లు, ప్రేయ‌సిరావేతో పాటు ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది రాశి. మ‌హేష్‌బాబు నిజం సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించింది. హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న త‌రుణంలో పెళ్లి చేసుకొని సినిమాల‌కు దూర‌మైంది. పెళ్లి త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోన్న రాశి దాదాపు ఐదేళ్ల విరామం త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్న‌ది.

రాఘ‌వ‌రెడ్డి మూవీలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ ట్రైల‌ర్ గురువారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌ను సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో క్రిమినాల‌జీ ప్రొఫెస‌ర్‌గా శివ కంఠ‌మ‌నేని క‌నిపిస్తోన్నాడు. అత‌డి భార్య‌గా రాశి క‌నిపిస్తోంది.

త‌న భార్య, కూతురును కాపాడుకోవ‌డానికి ఓ ప్రొఫెస‌ర్ చేసే ప్ర‌య‌త్నాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. రాఘ‌వ‌రెడ్డి సినిమాలో నందితా శ్వేత కీల‌క పాత్ర పోషిస్తోంది. మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను త‌ర్వాత తాను హీరోగా న‌టిస్తోన్న మూవీ ఇద‌ని శివ కంఠ‌మ‌నేని తెలిపాడు.

యాక్ష‌న్‌, డ్రామా, థ్రిల్ల‌ర్ అంశాల‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని రూపొందిస్తోన్న‌ట్లు డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి చెప్పాడు. రాఘ‌వ‌రెడ్డి సినిమా జ‌న‌వ‌రి 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈసినిమాలో బిత్తిరిస‌త్తి, ర‌ఘుబాబు ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. సుధాక‌ర్ మారియోతో క‌లిసి డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి రాఘ‌వ‌రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందిస్తోన్నాడు.

IPL_Entry_Point

టాపిక్