Oscars gift bags: ఇటలీ ట్రిప్, ఆస్ట్రేలియాలో ప్లాట్.. ఆస్కార్ నామినీలకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు-oscars gift bags to top nominees that includes italy trip and a plot in australia ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Oscars Gift Bags: ఇటలీ ట్రిప్, ఆస్ట్రేలియాలో ప్లాట్.. ఆస్కార్ నామినీలకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు

Oscars gift bags: ఇటలీ ట్రిప్, ఆస్ట్రేలియాలో ప్లాట్.. ఆస్కార్ నామినీలకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు

Hari Prasad S HT Telugu
Mar 13, 2023 06:14 PM IST

Oscars gift bags: ఇటలీ ట్రిప్, ఆస్ట్రేలియాలో ప్లాట్.. ఆస్కార్ టాప్ నామినీలకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇచ్చారు. వాళ్లకు అందిన గిఫ్ట్ బ్యాగ్ లలో మొత్తం ఇలాంటి 60 ఐటెమ్స్ ఉండటం విశేషం.

ఆస్కార్స్ టాప్ నామినీలకు ఖరీదైన గిఫ్ట్ బ్యాగులు
ఆస్కార్స్ టాప్ నామినీలకు ఖరీదైన గిఫ్ట్ బ్యాగులు

Oscars gift bags: ఆస్కార్స్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కితే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు. మరి ఆ ఆస్కార్స్ కు నామినేట్ అయినా అవార్డు దక్కని వాళ్ల సంగతేంటి? అలాంటి నామినీల కోసమే అకాడెమీ కొన్ని కాస్ట్‌లీ గిఫ్ట్ లు ఇస్తోంది. చాన్నాళ్ల కిందటే ఈ ఆనవాయితీ ప్రారంభం కాగా.. ఈసారి కూడా దానిని కొనసాగించారు. అయితే ఈ బహుమతులు నామినీలందరికీ కాదు.

కేవలం ఎంపిక చేసిన కొంతమంది టాప్ నామినీలకు మాత్రమే. 2023లో ఇలాంటి 26 మంది నామినీలకు ఈ ఖరీదైన గిఫ్ట్ బ్యాగులు ఇచ్చారు. యాక్టింగ్, డైరెక్టింగ్ నామినీలకు ఈసారి ఈ బహుమతులు అందాయి. ఈ గిఫ్ట్ బ్యాగ్ లో మొత్తం 1.26 లక్షల డాలర్లు (సుమారు రూ.1.03 కోట్లు) విలువైన బహుమతులు ఉండటం విశేషం. అందులో ఇటలీ ట్రిప్, ఆస్ట్రేలియాలో ఓ ప్లాట్ లాంటి మొత్తం 60 ఐటెమ్స్ ఉన్నాయి.

ఇందులో చాలా వరకూ ఖరీదైన వెల్‌నెస్ గిఫ్ట్ లే ఉంటాయి. వీటిని డిస్టింక్టివ్ అసెట్స్ అనే కంపెనీ అందిస్తోంది. 2002 నుంచి ఈ సంస్థే ఈ గిఫ్ట్ బ్యాగులు ఇస్తోంది. ఇందులో జపనీస్ మిల్క్ బ్రెడ్ లాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఉండటం విశేషం. ఇక 8 మంది మూడు రోజుల పాటు ఇటలీలో గడిపే అవకాశం కూడా ఉంటుంది.

ఆర్గానిక ఖర్జూరాలు, చాక్లెట్లు, ఓ ప్రత్యేకమైన వీడియో సందేశం కూడా ఈ గిఫ్ట్ బ్యాగులలో ఉంచారు. కొన్ని బ్రాండ్ల వాళ్లు 4 వేల డాలర్లు చెల్లించి మరీ ఈ గిఫ్ట్ బ్యాగులలో తమ వస్తువులు ఉండేలా చూసుకుంటారని ది గార్డియన్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే ఇందులోని ఐటెమ్స్ ను కచ్చితంగా వాడాల్సిన, అంగీకరించాల్సిన, ప్రమోట్ చేయాల్సిన అవసరం గిఫ్ట్ లు అందుకున్న వారికి ఉండదు.

ఈసారి మొత్తం 26 మంది టాప్ నామినీలు వీటిని అందుకున్నారు. వీళ్లలో ప్రముఖ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈసారి ఆస్కార్స్ లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీ అత్యధికంగా 7 అవార్డులు గెలుచుకుంది. ఈ మూవీ మొత్తం 11 కేటగిరీల్లో నామినేట్ కాగా.. 7 అవార్డులు వరించడం విశేషం.

Whats_app_banner

సంబంధిత కథనం