Ntr-Prashanth neel |ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్...భూమి పుత్రుడి పోరాట కథ ఇది
ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం అతడి అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఎన్టీఆర్ తో తాను చేయబోతున్న తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. హీరోయిజాన్ని విభిన్నంగా ఆవిష్కరించి కమర్షియల్ సినిమాకు కొత్త అర్థాన్ని చాటిచెప్పారు . కేజీఎఫ్ తర్వాత అతడితో సినిమాలు చేసేందుకు అన్ని భాషలకు చెందిన అగ్ర హీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
సలార్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 31వ సినిమా ఇది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను విడుదలచేశారు. ఇందులో గడ్డం, పొడవైన మీసకట్టుతో రఫ్ లుక్ లో ఎన్టీఆర్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు.
రక్తంతో తడిసిన నేలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం... అతడు ఆ భూమి పుత్రుడు.. అక్కడే పెరిగాడు. కానీ అతడి రక్తం మాత్రం అక్కడ చిందలేదు అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రశాంత్ నీల్ క్యాప్షన్ ను జోడించారు. క్యాప్షన్ తోనే ఎన్టీఆర్ రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని ప్రశాంత్ నీల్ చాటిచెప్పారు.
ఈ లుక్ కు ఎన్టీఆర్ అభిమానుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ లుక్ ఉందని చెబుతున్నారు. సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
టాపిక్