Mad OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మ్యాడ్ - రిలీజ్ డేట్ ఇదే!
Mad OTT Release Date:టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ మ్యాడ్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Mad OTT Release Date: రీసెంట్ యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ మూవీ మ్యాడ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలిసింది. ఫన్ ఎంటర్‌టైనర్ మూవీని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.
మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ఇతర నాయకానాయికలుగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ క్రియేట్ చేసిన కామెడీ, రాసిన పంచ్ డైలాగ్స్ థియేటర్లలో అభిమానులను అలరించాయి. రెండున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 25 కోట్లకుపైగా గ్రాస్‌ను, 12 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. నిర్మాతలకు మూడింతల లాభాల్ని మిగిల్చింది. మ్యాడ్ మూవీలో డైరెక్టర్ కేవీ అనుదీప్ అతిథి పాత్రలో కనిపించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు.
మ్యాడ్ కథేమిటంటే?
మనోజ్ (రామ్ నితిన్)అశోక్ (నార్నే నితిన్) దామోదర్ (సంగీత్ శోభన్) అనే ముగ్గురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కథతో మ్యాడ్ సినిమా తెరకెక్కింది. కాలేజీ లైఫ్‌తో పాటు వారి ప్రేమకథల్లో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వినోదాత్మకంగా ఈ సినిమాలో ఆవిష్కరించారు