RRR | ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో వీడియో సాంగ్ విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ సాంగ్‌లో ఎన్టీఆర్ నటనకు యావత్ దేశమంతా ఫిదా అయింది.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో వేరే చెప్పనక్కర్లేదు. రూ.1000 కోట్ల పైచిలుకు వసూళ్లతో అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు నిరాజనాలు పట్టారు. ముఖ్యంగా తారక్ చేసిన కొమురం భీముడో పాటను లైవ్‌లో చూస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందే. అంత భావోద్వేగంగా ఉంటుంది ఆ పాటు. ఈ ఒక్క పాటతో నటనలో ఎన్టీఆర్ స్టామినా ఏంటో యావత్ దేశానికి తెలుసొచ్చింది. ఈ పాటకున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఆర్ఆర్ఆర్ టీమ్.. ఈ వీడియో సాంగ్‌ను అన్నింటికంటే చివరన విడుదల చేయాలని నిర్ణయించింది. తాజాగా ఈ వీడియో సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది.
సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా పాటలను రిలీజ్ చేస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తోందీ ఆర్ఆర్ఆర్ టీమ్. ముందు నాటు, నాటు సాంగ్, తర్వాత కొమ్మా ఉయ్యాల, దోస్తీ ఇలా కొమురం భీముడో మినహా మిగిలిన వీడియో సాంగ్స్‌ను విడుదల చేసింది. తాజాగా కొమురం భీముడో వీడియో పాటను విడుదల తేదీని ఫిక్స్ చేసింది. దీని ఫుల్ వీడియో సాంగ్‌ను మే 06 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసింది.
కొమురం భీముడో సాంగ్ సినిమాను మలుపు తిప్పే సన్నివేశంలో వస్తుంది. ఈ పాటలో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సాంగ్‌లో తారక్ నటన తనకు ఎంతో ఇష్టమనని స్వయాన రాజమౌళి చెప్పాడంటే ఈ సాంగ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాశారు. కాల భైరవ ఈ సాంగ్‌ను ఆలపించాడు.
ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
సంబంధిత కథనం
టాపిక్