Kantara OTT Release Date: క‌న్న‌డ హిట్ చిత్రం కాంతారా ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడంటే-kantara ott release date when and where to watch this kannada blockbuster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kantara Ott Release Date When And Where To Watch This Kannada Blockbuster

Kantara OTT Release Date: క‌న్న‌డ హిట్ చిత్రం కాంతారా ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడంటే

Nelki Naresh Kumar HT Telugu
Oct 10, 2022 12:29 PM IST

Kantara OTT Release Date: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన క‌న్న‌డ సినిమా కాంతారా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ క‌న్న‌డ‌ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే...

రిష‌బ్ శెట్టి
రిష‌బ్ శెట్టి (Twitter)

Kantara OTT Release Date: రిష‌బ్ శెట్టి (Rishab shetty)హీరోగా న‌టించిన క‌న్న‌డ సినిమా కాంతారా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నాన్ని సృష్టిస్తోంది. ప‌ది రోజుల్లోనే అర‌వై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. రిలీజ్‌కు ముందు భారీ ధ‌ర‌కు ఈ డీల్ కుదిరిన‌ట్లు తెలిసింది.

న‌వంబ‌ర్ 4న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డంతోపాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది. కాగా క‌న్న‌డంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. అక్టోబ‌ర్ 15న గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ తెలుగులో విడుద‌ల చేయ‌బోతున్న‌ది.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీలో భాష‌ల్లో వ‌చ్చే వారం థియేట‌ర్ల‌లో కాంతార సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్‌కు, శివ అనే యువ‌కుడికి మ‌ధ్య జ‌రిగిన పోరాటం నేప‌థ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కాంతారా సినిమా రూపొందింది. రిష‌బ్ శెట్టి యాక్టింగ్‌తోపాటు విజువ‌ల్స్ కు ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబ‌లే ఫిల్మ్స్ కాంతారా సినిమాను తెర‌కెక్కించింది.

IPL_Entry_Point