Kajal Aggarwal | తల్లి కోసం కవిత రాసిన కాజల్... మదర్స్ డే రోజున స్పెషల్ పోస్ట్...
తల్లిగా మారిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని అంటోంది కాజల్ అగర్వాల్. మజిలీని దాటుకొని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతోందని చెప్పింది. మదర్స్ డే సందర్భంగా తల్లితో తనకున్న అనుబంధాన్ని కవిత రూపంలో వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్.
మదర్స్ డేను పురస్కరించుకొని తన తల్లి సుమన్ అగర్వాల్ పట్ల తనకున్న ప్రేమను,అభిమానాన్ని కవిత రూపంలో వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. తల్లి తన జీవితంలో స్పెషల్ పర్సన్ అని కాజల్ తెలిపింది. తల్లిగా మారిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని,గతంలో మాదిరిగా తాను లేనని ఈ కవితలో తెలిపింది. ఒక మజిలీని దాటుకొని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టానని చెప్పింది.
ఇప్పుడే జీవితం తాలూకు కొత్త వెలుగులను చూస్తున్నానని చెప్పింది. గతంలో నాకు తెలిసిన విషయాలన్నీ ఇప్పుడు మరింత శోభతో కనిపిస్తున్నాయని కాజల్ ఈ కవితలో పేర్కొన్నది. అమ్మలోని మరో కోణాన్ని తరచిచూసే స్థితిలో తాను ఉన్నానని కాజల్ తల్లిపై ప్రేమను కవిత ద్వారా చాటిచెప్పింది. మాతృత్వపు బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత అమ్మతో పంచుకోవాలని అనుకున్న అన్ని విషయాల్ని ఈ కవిత ద్వారా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పింది.
తన తనయుడుకి మంచి అమ్మమ్మగా సుమన్ అగర్వాల్ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. మదర్స్ డే రోజున తన ఆలోచనలను అమ్మతో కవిత రూపంలో పంచుకునే అవకాశం రావడం సంతోషాన్ని కలిగిస్తోందని కాజల్ పేర్కొన్నది. కాజల్ పోస్ట్ చేసిన ఈ కవిత అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి నీల్ కిచ్లూ అంటూ పేరుపెట్టారు.
టాపిక్