Jawan Day 11 Collections: పుంజుకున్న జవాన్ కలెక్షన్లు.. 11రోజుల్లోనే ఆ క్లబ్‍లోకి..
Jawan Day 11 Collections: జవాన్ సినిమా కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయి. వినాయక చవితి ముందు వీకెండ్‍లో మంచి కలెక్షన్లను సాధించింది ఈ షారుఖ్ మూవీ. 11 రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందంటే..
Jawan Day 11 Collections: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయి. రెండో వారం ప్రారంభంలో వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అయితే, రెండో వారం వీకెండ్‍లో మళ్లీ సత్తాచాటింది జవాన్. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో డ్యుయల్ రోల్, విభిన్న గెటప్‍లలో షారుఖ్ యాక్షన్ సీక్వెన్సులు, స్వాగ్ అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. సెప్టెంబర్ 7న జవాన్ రిలీజ్ కాగా.. పాజిటివ్ టాక్ రావటంతో తొలి వారం కలెక్షన్ల సునామీ సృష్టించింది. రెండో వారంలోనూ వసూళ్లలో పుంజుకుంది. 11 రోజుల్లో జవాన్ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందంటే..
జవాన్ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.821కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. రూ.800కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టింది. 11వ రోజైన ఆదివారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.59.15కోట్లను దక్కించుకుంది. పఠాన్ తర్వాత రూ.800కోట్లను సాధించిన రెండో షారుఖ్ చిత్రంగా జవాన్ నిలిచింది. ఇంకా థియేట్రికల్ ఉండటంతో పఠాన్‍ను జవాన్ దాటుతుందేమో చూడాలి.
మరోవైపు, రూ.800కోట్లను అత్యంత వేగంగా సాధించిన బాలీవుడ్ మూవీగా జవాన్ రికార్డు సాధించింది. 11రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి బాలీవుడ్ బాద్‍షా సత్తాను మరోసారి చాటింది. ఈ ఏడాది రిలీజ్ అయిన షారుఖ్ పఠాన్ బంపర్ హిట్ కాగా.. జవాన్ కూడా అదే దిశగా పయనిస్తోంది. పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,000కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
జవాన్ సినిమా ఇండియాలో 11 రోజుల్లో రూ.430.44కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. 11వ రోజైన ఆదివారం దేశంలో ఈ చిత్రానికి రూ.34.26కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఈ వీకెండ్‍లో పెద్ద చిత్రాలు ఏవీ విడుదల కాకపోవడం జవాన్‍కు కలిసి వచ్చింది. దీంతో వీకెండ్‍లో కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి. మరో వారం పాటు ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. వినాయక చవితి సెలవులు కూడా ఈ మూవీ కలిసి రానున్నాయి.
జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి విలన్‍గా నటించారు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ క్యామియో రోల్ చేశారు. నయనతార హీరోయిన్‍గా ఈ మూవీలో చేయగా.. ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్.. జవాన్ మూవీని నిర్మించారు.