Jabardasth Shanthi Kumar: డైరెక్ట‌ర్‌గా మారిన‌ మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - త్వ‌ర‌లో సినిమా రిలీజ్‌-jabardasth comedian shanthi kumar turns director with natho nenu movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jabardasth Shanthi Kumar: డైరెక్ట‌ర్‌గా మారిన‌ మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - త్వ‌ర‌లో సినిమా రిలీజ్‌

Jabardasth Shanthi Kumar: డైరెక్ట‌ర్‌గా మారిన‌ మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - త్వ‌ర‌లో సినిమా రిలీజ్‌

HT Telugu Desk HT Telugu
Jul 05, 2023 02:17 PM IST

Jabardasth Shanthi Kumar: వేణు టిల్లు బాట‌లోనే మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ శాంతికుమార్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తోన్నాడు. నాతో నేను పేరుతో ఓ మూవీని తెర‌కెక్కించాడు.

శ్రీకాంత్‌, శాంతి కుమార్‌
శ్రీకాంత్‌, శాంతి కుమార్‌

Jabardasth Shanthi Kumar: బ‌ల‌గం సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చాడు జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ వేణు టిల్లు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. తాజాగా వేణు బాట‌లోనే మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్‌ క‌మెడియ‌న్ అడుగులు వేయ‌బోతున్నాడు. నాతో నేను అనే సినిమాతో షైనింగ్ శాంతికుమార్ ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు క‌థ‌, మాట‌లు, పాట‌లు శాంతికుమార్ అందిస్తోన్నాడు.

నాతో నేను సినిమాలో సాయికుమార్‌, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని రెట్రో సాంగ్‌ను ఇటీవ‌ల సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశాడు. సోష‌ల్ మెసేజ్‌తో కూడిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొందిస్తోన్న‌ట్లు శాంతికుమార్ తెలిపాడు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని అన్నాడు. వ‌చ్చే నెల‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. నాతో నేను సినిమాలో రాజీవ్ క‌న‌కాల‌, ఐశ్వ‌ర్య కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. టంగుటూరి ప్ర‌శాంత్ నిర్మిస్తోన్నాడు.

మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శాంతికుమార్ ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్థ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్‌గా చాలా రోజుల పాటు కొన‌సాగిన అత‌డు ప్ర‌స్తుతం టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. వేణు టిల్లు, శాంతికుమార్‌తో పాటు మ‌రో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ కిరాక్ ఆర్పీ కూడా డైరెక్ట‌ర్‌గా మార‌బోతున్నాడు. సుధీర్, గెట‌ప్ శ్రీను, రాంప్ర‌సాద్‌తో పాటు అదిరే అభి న‌టులుగా బిజీగా ఉన్నారు.

టాపిక్