Yash | ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కానీ... ఫ్యాన్స్ కు డిఫరెంట్ గా కృత‌జ్ఞ‌తలు చెప్పిన య‌శ్‌-hero yash said his self confidence made him top star ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yash | ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కానీ... ఫ్యాన్స్ కు డిఫరెంట్ గా కృత‌జ్ఞ‌తలు చెప్పిన య‌శ్‌

Yash | ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు కానీ... ఫ్యాన్స్ కు డిఫరెంట్ గా కృత‌జ్ఞ‌తలు చెప్పిన య‌శ్‌

Nelki Naresh HT Telugu
Apr 21, 2022 06:07 PM IST

కేజీఎఫ్‌-2తో త‌న‌కు పెద్ద స‌క్సెస్‌ను అందించిన అభిమానుల‌కు హీరో య‌శ్ వినూత్న రీతిలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఓ చిన్న క‌థ‌ను అభిమానులతో పంచుకున్నాడు. అది ఏమిటంటే...

హీరో య‌శ్
హీరో య‌శ్ (twitter)

కేజీఎఫ్ సిరీస్ సినిమాల‌తో  పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయారు కన్నడ హీరో యశ్. రాఖీభాయ్ పాత్ర‌లో య‌శ్ న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీతో పాటు అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌కు దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులంద‌రూ ఫిదా అవుతున్నారు. రాఖీభాయ్‌గా అత‌డి ఆటిట్యూడ్‌, హీరోయిజానికి బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతున్న‌ది. కేజీఎఫ్ 2 ఏడు రోజుల్లోనే ఏడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించి వ‌సూళ్ల రేసులో దూసుకుపోతున్న‌ది. 

ఈ సినిమాతో త‌న‌కు పెద్ద విజ‌యాన్ని అందించిన అభిమానుల‌కు య‌శ్ విభిన్నంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.  ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందులో అత‌డు చెప్పిన పిట్ట క‌థ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ‘ఒక‌ప్పుడు ఓ చిన్న‌గ్రామం క‌రువుతో అల్లాడిపోతుండేది. ఆ ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్క‌డానికి ప్ర‌జ‌లంద‌రూ ప్రార్థన‌లు చేయాల‌ని అనుకున్నారు. ఓ చోట గుమిగూడారు. ఆక్క‌డికి ఓ బాలుడు గొడుగుతో వ‌చ్చాడు.కొందరు అతడిని అమాయకుడని గేలిచేశారు. మరికొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు.  అతడిది  నమ్మకం.  వర్షం పడుతుందనే నమ్మకంతో గొడుగుతో ఆ బాలుడు అక్కడికి వచ్చాడు. నేను ఆ పిల్లాడి లాంటివాడినే. ఆత్మవిశ్వాసమే న‌న్ను అగ్రహీరోగా నిలబెట్టింది. హీరోగా నన్ను ఈ స్థాయికి చేర్చిన అభిమానులకు థాంక్స్ చెప్ప‌డం చిన్న‌మాటే అవుతుంది. నాపై మీరు చూపించిన ప్రేమ‌కు కేజీఎఫ్ టీమ్ త‌రఫున హృద‌య‌పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా’ అంటూ య‌శ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. 

ప్ర‌స్తుతం య‌శ్ పోస్ట్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. కేజీఎఫ్ 2 చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సంజ‌య్‌ద‌త్‌, ప్ర‌కాష్‌రాజ్‌, ర‌వీనా టాండ‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 

IPL_Entry_Point

సంబంధిత కథనం