Siddharth and Aditi Rao Hydari: శర్వా నిశ్చితార్థంలో హీరో సిద్ధార్థ్.. అదితితో కలిసి హాజరు.. ఊపందుకున్న ఊహాగానాలు
Siddharth and Aditi Rao Hydari: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి హీరో సిద్ధార్థ్.. తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావ్ హైదరితో కలిసి హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Siddharth and Aditi Rao Hydari: ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుసపెట్టి విజయాలు అందుకున్న హీరో సిద్ధార్థ్ ఇప్పుడు కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు. అడపా దడపా చిత్రాలు మినహా పెద్దగా ఇక్కడ చేయట్లేదు. అయితే సినిమాల ద్వారా వార్తల్లో నిలవనప్పటికీ వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లోనే ఉంటున్నాడు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావ్ హైదరితో ప్రేమలో ఉన్నాడంటూ ఇటీవల కాలంలో విస్తృంతంగా ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుంది. తాజాగా ఈ జోడీ మరోసారి బహిరంగంగా దర్శనమిచ్చింది. టాలీవుడ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం వేడుకకు సిద్ధార్థ్-అదితి ఇద్దరూ కలిసి హాజరయ్యారు.
హీరో సిద్ధార్థ్ తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావ్ హైదరీతో కలిసి ఇటీవల కాలంలో చాలా చోట్లకు వెళ్తున్నాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చాలాసార్లు కెమెరా కంటికి చిక్కారు. తాజాగా శర్వానంద్ నిశ్చితార్థం వేడుకలోనూ కలిసి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా వీరి ప్రేమ వ్యవహారం మరోసారి పబ్లిక్ ప్లాట్‌ఫాంలోకి వచ్చింది. నెటిజన్లు కూడా వీరి ప్రేమ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు.
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. యూఎస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో శర్వా నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, నాగార్జునతో పాటు పలువురు సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు సిద్ధార్థ్-అదితిరావ్ హైదరి కూడా కలిసి హాజరయ్యారు.
శర్వానంద్‌తో కలిసి మహా సముద్రం చిత్రంలో కనిపించిన సిద్ధార్థ్.. వ్యక్తిగత జీవితం పరంగా చాలా మందితో ప్రేమాయణం నడిపాడు. ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ అదితి రావ్ హైదరీతో కలిసి ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సదరు నటీ నటులు ఎప్పుడూ స్పందించలేదు.
సంబంధిత కథనం