Hansika My3 Web Series: రోబోగా హన్సిక - మైత్రీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Hansika My3 Web Series: హీరోయిన్ హన్సిక ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ పేరుతో ఫస్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ద్వారా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Hansika My3 Web Series: హన్సిక డెబ్యూ వెబ్‌సిరీస్ మైత్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. సైంటిఫిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో మైత్రీ అనే రోబోగా హన్సిక కనిపించబోతున్నది. ఓ యంగ్ సైంటిస్ట్ చేసిన తప్పిదం కారణంగా రోబో త్రిబుల్ రోల్‌లోకి మారడం, ఆ లేడీ రోబోతో కొందరు యువకులు ప్రేమలో పడే సన్నివేశాలతో ట్రైలర్ సరదాగా సాగింది.
రోబోగా హన్సిక లుక్, మ్యానరిజమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. కెరీర్‌లో హన్సిక నటిస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ వెబ్‌సిరీస్‌లో హన్సికతో పాటు శంతనుభాగ్యరాజ్, జనని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు రాజేష్. ఎం దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ అనే టైటిల్‌తో పాటు ఏ రోబోటిక్ లవ్‌స్టోరీ అని రాసి ఉన్న క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, కన్నడ, హిందీ,మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో వెబ్‌సిరీస్‌లపై దృష్టిసారిస్తోంది హన్సిక. ప్రస్తుతం తెలుగులో నషా అనే వెబ్‌సిరీస్ లో నటిస్తోంది హన్సిక.
తెలుగులో హన్సిక హీరోయిన్‌గా నటించిన మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ సినిమాల షూటింగ్స్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యాయి. సరైన బజ్ లేని కారణంగా విడుదల ఆలస్యమవుతోంది. మరోవైపు తమిళంలో మ్యాన్, గార్డియన్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది హన్సిక.