Yuvraj wishes to Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపిన యువరాజ్ సింగ్.. ప్రశంసలతో ట్వీట్-former team india all rounder yuvraj singh wishes to balakrishna on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yuvraj Wishes To Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపిన యువరాజ్ సింగ్.. ప్రశంసలతో ట్వీట్

Yuvraj wishes to Balakrishna: బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపిన యువరాజ్ సింగ్.. ప్రశంసలతో ట్వీట్

Yuvraj wishes to Balakrishna: హీరో బాలకృష్ణకు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పుట్టి రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు యువీ ట్వీట్ చేశాడు.

Yuvraj wishes to Balakrishna: బాలకృష్ణకు విషెస్ తెలిపిన యువరాజ్ సింగ్.. ప్రశంసలతో ట్వీట్ (Photo: Twitter/Yuvraj)

Yuvraj wishes to Balakrishna: నందమూరి నటసింహం, సీనియర్ సినీ హీరో బాలకృష్ణ నేడు (జూన్ 10) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ రంగం నుంచి చాలా మంది బాలయ్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగానూ బాలకృష్ణ ఉండటంతో అనేక మంది రాజకీయ నేతలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ కూడా బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

క్యాన్సర్ ఆసుపత్రితో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారంటూ బాలకృష్ణను యువరాజ్ ప్రశంసించారు. “బాలకృష్ణ సర్ మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ పట్ల అంకితభావంతో మీరు సమాజంపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే చాలా కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్నారు. ఇది అందరికీ స్ఫూర్తివంతం. ఈ సంవత్సరమంతా మీకు గొప్పగా ఉండాలి” అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. గతంలో బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోలను యువీ పోస్ట్ చేశారు. హైదరాబాద్‍లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ చైర్మన్‍గా ఉన్నారు. చాలా మంది పేదలకు బాలయ్య వైద్య సాయం కూడా చేస్తున్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

యువరాజ్ సింగ్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి కీమోథెరపి తీసుకున్నారు. అనంతరం క్యాన్సర్‌ను జయించి కోలుకున్నారు. 2011 ప్రపంచకప్‍ను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించి.. ఆ తర్వాత క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు యువరాజ్. అప్పటి నుంచి క్యాన్సర్‌కు సంబంధించి చాలా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

కాగా, బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రం టీజర్ నేడు విడుదలైంది. తెలంగాణ యాసతో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‍‍లు అదిరిపోయేలా ఉన్నాయి. మరోసారి పక్కా మాస్ యాక్షన్ సినిమాతో బాలయ్య వస్తున్నారని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య మార్క్ మేనరిజం, తెలంగాణ యాస కలిసి.. అభిమానులకు ఈ మూవీ పండుగలా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడిగా ఉండగా.. కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్‍గా నటిస్తోంది. ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భగవంత్ కేసరి మూవీ ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలవుతుందని టాక్.