Sexual Abuse on Asha Saini: లక్స్ పాపకు ఎంత కష్టమొచ్చింది..14 నెలలు నరకం.. ప్రైవేటు భాగాలపై విచక్షణా రహితంగా దాడి-flora saini reveal shocking details of getting her private parts punched by producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sexual Abuse On Asha Saini: లక్స్ పాపకు ఎంత కష్టమొచ్చింది..14 నెలలు నరకం.. ప్రైవేటు భాగాలపై విచక్షణా రహితంగా దాడి

Sexual Abuse on Asha Saini: లక్స్ పాపకు ఎంత కష్టమొచ్చింది..14 నెలలు నరకం.. ప్రైవేటు భాగాలపై విచక్షణా రహితంగా దాడి

Maragani Govardhan HT Telugu
Feb 01, 2023 06:37 AM IST

Sexual Abuse on Asha Saini: ప్రముఖ నటి ఫ్లోరా సైనీ అలియస్ ఆషా సైనీ జీవితంలో తను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన అనుభవాన్ని గురించి బయటపెట్టింది. ఓ ప్రముఖ నిర్మాత తనను తీవ్రంగా హింసించాడని, 14 నెలల పాటు నరకమంటే ఎంటో చూపించాడని పేర్కొంది.

ఫ్లోరా సైనీ
ఫ్లోరా సైనీ

Sexual Abuse on Asha Saini: ఫ్లోరా సైనీ.. ఈ పేరు పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. అదే లక్స్ పాప అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఆమె ఆషా సైనీ. తెలుగులో డజనుకుపైగా సినిమాల్లో కనిపించిన ఆషా సైనీ అసలు పేరు ఫ్లోరా సైనీ. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో మెరిసింది. ప్రత్యేక గీతాల్లో నర్తించింది. ఆ మధ్య కాలంలో మీటూ ఉద్యమం బాగా వెలుగులోకి వచ్చినప్పుడు ఎంతో మంది నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పబ్లిక్‌గానే పంచుకున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆషా సైనీ కూడా చేరిపోయింది. ఓ ప్రముఖ నిర్మాత తనను మోసగించాడని, 14 నెలల పాటు లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ప్రైవేటు భాగాలపై గాయపరిచాడని, దారుణంగా హింసించేవాడని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోను గమనిస్తే.. ఫ్లోరా సైనీ తనకు జరిగిన గుర్తు చేసుకుంటూ ఇమేజెస్ రూపంలో తెలిపింది. "20 ఏళ్ల వయసులో కెరీర్‌లో పీక్‌లో ఉన్నాను. బాలీవుడ్‌లో 10కి పైగా చిత్రాలు చేశాను. మోడలింగ్ యాడ్స్ చేశాను. కానీ ఆ తర్వాత నేను ఓ ప్రముఖ నిర్మాతను ప్రేమించా.. అంతలోనే నా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతడు నన్ను దుర్భాషలాడాడు. నా ముఖంపై, ప్రవేటు భాగాలపై విచక్షణారహితంగా గాయపరిచాడు. నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనీయకుండా చేశాడు. చివరకు అతడి వద్ద నుంచి నేను తప్పించుకుని పారిపోయాను. నా తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాను. ఆ నరకం నుంచి కోలుకోడానికి కొన్ని నెలల సమయమే పట్టింది. నన్ను ఇష్టపడే వారి మద్దతుతో సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం తల్లిదండ్రులతో ఆనందంగా ఉన్నాను." అని ఫ్లోరా సైనీ తెలిపింది.

ఆషా సైనీ 1999లో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. నరసింహానాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ప్రేమతో, ఆ ఇంట్లో తదితర చిత్రాల్లో మెరిసింది. అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. ఇటీవల భేడియా, దో లఫ్జాన్ కీ కహానీ, గుడ్డు కి గన్ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

Whats_app_banner

సంబంధిత కథనం