Faria Abdullah Debut Web Series: ఇండియాలోనే ఫ‌స్ట్ క్లి - ఫై వెబ్‌సిరీస్‌లో ఫ‌రియా అబ్దుల్లా - స్ట్రీమింగ్ డేట్ ఇదే-faria abdullah debut web series the jengaburu curse streaming date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Faria Abdullah Debut Web Series: ఇండియాలోనే ఫ‌స్ట్ క్లి - ఫై వెబ్‌సిరీస్‌లో ఫ‌రియా అబ్దుల్లా - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Faria Abdullah Debut Web Series: ఇండియాలోనే ఫ‌స్ట్ క్లి - ఫై వెబ్‌సిరీస్‌లో ఫ‌రియా అబ్దుల్లా - స్ట్రీమింగ్ డేట్ ఇదే

HT Telugu Desk HT Telugu
Jul 14, 2023 06:42 AM IST

Faria Abdullah Debut Web Series: ఇండియాలోనే ఫ‌స్ట్ క్లి - ఫై వెబ్‌సిరీస్‌తో త్వ‌ర‌లో ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది ఫ‌రియా అబ్దుల్లా. ది జెంగాబురు క‌ర్స్ పేరుతో తెర‌కెక్కిన ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

ఫ‌రియా అబ్దుల్లా
ఫ‌రియా అబ్దుల్లా

Faria Abdullah Debut Web Series:ఫ‌రియా అబ్దుల్లా ఫ‌స్ట్ బాలీవుడ్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స‌యింది. అక్ర‌మ మైనింగ్ వ్యాపారం నేప‌థ్యంలో ది జెంగాబురు క‌ర్స్ పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్ ఆగ‌స్ట్ 9 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ట్రైల‌ర్‌ను యూనిట్ రిలీజ్ చేశారు. అక్ర‌మ మైనింగ్ వ్యాపారాలు, అక్క‌డ జ‌రుగుతోన్న మిస్ట‌రీ డెత్‌ల‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా రేకెత్తిస్తోంది.

ఈ సిరీస్‌లో ప్రియా దాస్ అనే ఎన్ఆర్ఐ పాత్ర‌ను ఫ‌రియా అబ్దుల్లా పోషించింది. క‌నిపించ‌కుండా పోయిన త‌న తండ్రిని అన్వేషిస్తూ ఒడిశాలోని మైనింగ్ ప్రాంతంలో అడుగుపెట్టిన ఆమెకు అక్క‌డ జ‌రుగుతోన్న అక్ర‌మ మైనింగ్ వ్యాపారాల గురించి ఏం తెలిసింది? మైనింగ్ బిజినెస్ వ‌ల్ల ఆదివాసీలు ఏవిధంగా అన్యాయాల‌కు గురవుతున్నార‌న్న‌ది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు నీల మాధ‌బ్ పాండ ఈ సిరీస్‌లో ఆవిష్క‌రించారు.

ఈ సిరీస్ మొత్తం ఫ‌రియా అబ్దుల్లా పాత్ర నేప‌థ్యంలోనే సాగుతుంద‌ని స‌మాచారం. ఇండియాలోనే ఫ‌స్ట్ క్లి -ఫై (క్లైమేట్ ఛేంజ్ కాన్సెప్ట్‌) వెబ్‌సిరీస్ ఇదేన‌ని యూనిట్ ప్ర‌క‌టించింది. వెండితెర‌పై ఎక్కువ‌గా కామెడీ త‌ర‌హా పాత్ర‌లు చేసింది ఫ‌రియా అబ్దుల్లా. వాటికి భిన్నంగా ఈ వెబ్‌సిరీస్‌లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సీరియ‌స్ రోల్‌లో ఫ‌రియా అబ్దుల్లా క‌నిపించ‌బోతున్న‌ది.

ది జెంగాబురు క‌ర్స్ సిరీస్‌లో నాజ‌ర్, మ‌క‌రంద్ దేశ్‌పాండే ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జాతిర‌త్నాలు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ‌రియా అబ్దుల్లా తొలి అడుగులోనే పెద్ద స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న‌ది.

ఇటీవ‌ల ర‌వితేజ రావ‌ణాసుర‌లో ఓ హీరోయిన్‌గా క‌నిపించింది. విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టిస్తోన్న వ‌ల్లిమ‌యిల్ సినిమాతో త్వ‌ర‌లోనే కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది ఫ‌రియా అబ్దుల్లా.

IPL_Entry_Point