Agent Second Single Release: ఏజెంట్ నుంచి మరో పాట.. రొమాంటిక్ మెలోడి అదుర్స్-endhe endhe song released from akhil akkineni agent movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Second Single Release: ఏజెంట్ నుంచి మరో పాట.. రొమాంటిక్ మెలోడి అదుర్స్

Agent Second Single Release: ఏజెంట్ నుంచి మరో పాట.. రొమాంటిక్ మెలోడి అదుర్స్

Maragani Govardhan HT Telugu
Mar 24, 2023 07:31 PM IST

Agent Second Single Release: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ నుంచి మరో పాట విడుదలైంది. ఏందే ఏందే అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ అదిరిపోయింది. ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏజెంట్ చిత్రం నుంచి ఏందే ఏందే పాట విడుదల
ఏజెంట్ చిత్రం నుంచి ఏందే ఏందే పాట విడుదల

Agent Second Single Release: అక్కినేని హీరో అఖిల్ గత ఏడాదిన్నర కాలంగా ఒకే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అదే ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. ఆలస్యమవుతూ వచ్చింది. అయితే మధ్య మధ్యలో సినిమాకు సంబంధించిన టీజర్లు, పాటలు మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ సినిమా నుంచి పాటను విడుదల చేసింది.

ఏందే ఏందే అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ మెలోడీగా రూపొందించిన ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. హిప్ హాప్ తమిళ ఈ పాటకు కంపోజ్ చేయగా.. ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేటట్లు రాసిన పదాలు అద్భుతమైన సొగసును తీసుకొచ్చాయి. సంజిత హెగ్డే, హిప్ హాప్ తమిళ కలిసి ఈ పాటను ఆలపించారు.

ఈ సాంగ్‌లో అఖిల్ చాలా స్టైలిష్‌గా కనిపించగా.. హీరోయిన్ సాక్షి వైద్య ఆకర్షణీయంగా ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. విదేశాల్లో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. అఖిల్ ఇంతకుముందెన్నడు చూడని గెటప్పులో అదరగొట్టాడు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా ప్రారంభించారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. అఖిల్ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియన్ చిత్రం.

టాపిక్