Disha Patani: నా సినిమాలు నేను చూడను.. తెరపై నాకు నేను నచ్చను.. దిశా వ్యాఖ్యలు-disha patani says hates to watch her movies on screen ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Disha Patani: నా సినిమాలు నేను చూడను.. తెరపై నాకు నేను నచ్చను.. దిశా వ్యాఖ్యలు

Disha Patani: నా సినిమాలు నేను చూడను.. తెరపై నాకు నేను నచ్చను.. దిశా వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Jul 23, 2022 12:57 PM IST

తెరపై తమను తాము చూసుకోవాలని ప్రతి ఒక్క హీరోయిన్ కలలు కంటుంది. కానీ దిశా పటానీ మాత్రం ఇందుకు విరుద్ధం. తెరపైన తనను తాను చూసుకోవడం అస్సలు ఇష్టముండదని చెబుతోందీ ముద్దుగుమ్మ.

<p>దిశా పటానీ&nbsp;</p>
దిశా పటానీ (AFP)

అందాల ఆరబోతలో నేటి హీరోయిన్లలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. ఈ విషయంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీతో ఎవ్వరూ పోటీ పడలేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది దిశ. ప్రజలు తన అందం చూసి తనను ఎంతో పర్పెక్ట్ అనుకుంటారని, కానీ వెండితెరపై తనను చూసుకోవడం ఏ మాత్రం ఇష్టముండదని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

"దిశా పటానీ పర్ఫెక్టుగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకైతే మాత్రం నన్ను నేను తెరపై చూసుకోవడం ఇష్టముండదు. తెరపై కనిపించినప్పుడు ఎక్కువ సమయం కళ్లు మూసుకునే ఉంటాను. అందుకే నేను నటించిన సినిమాలను చూసుకోవడం నాకు పెద్దగా నచ్చదు" అని దిశా పటాని చెప్పింది.

ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంతో తొలిసారి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన దిశా.. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. అంతకంటే ముందు తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్‌లో చేసింది. అనంతరం టైగర్ ష్రాఫ్‌తో బాఘీ2లో నటించింది. ఇది కాకుండా సల్మాన్ సరనస భారత్, రాధే తదితర చిత్రాల్లో మెరిసింది.

ప్రస్తుతం దిశా పటానీ నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహిత్ సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తార సుతారియా తదితరులు నటించారు. ఈ చిత్రం 2014లో విడుదలైన ఏక్ విలన్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇది కాకుండా కరణ్ జోహార్ యోధలోనూ చేస్తుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది నవంబరు 11న విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం