ఆదిత్య 369 చిత్రం మొదట మల్టీస్టారర్.. బాలయ్య పక్కన స్టార్ హీరో!-did you know balakrishna aditya 369 would be a multi starrer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆదిత్య 369 చిత్రం మొదట మల్టీస్టారర్.. బాలయ్య పక్కన స్టార్ హీరో!

ఆదిత్య 369 చిత్రం మొదట మల్టీస్టారర్.. బాలయ్య పక్కన స్టార్ హీరో!

Maragani Govardhan HT Telugu
Jan 09, 2022 07:52 PM IST

కాలంలో నడిచే యంత్రం(Time Machine) కథాంశంతో రూపొందిన ఆదిత్య 369 అటు శాస్త్రీయంగా ఉండటమే కాకుండా ఇటు వైపు జానపద, పౌరాణిక కోణాన్ని కూడా ఆవిష్కరించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్స్​ను పోషించాడు. అయితే మొదట దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్​గా తీయాలనుకున్నారట. ఇంతకీ మరో హీరో ఎవరో తెలుసా?

ఆదిత్య 369
ఆదిత్య 369 (hindustan times)

తెలుగులో రొటీన్ కు భిన్నంగా, ఆలోచింపజేసే, కొన్నేళ్ల తర్వాత కూడా మాట్లాడుకోగలిగే చిత్రాలు చాలా తక్కువే అని చెప్పాలి. అలాంటి వైవిధ్యమైన సినిమాల జాబితాలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 ముందు వరుసలో ఉంటుంది. 1991లో విడుదలైన ఈ సినిమా అప్పట్లే పెద్దగా థియేటర్లలో ఆడనప్పటికీ నేటి తరం యువత ఈ సినిమాను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సైంటిఫిక్ జోనర్​లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్​గా నిలిచింది. కాలంలో నడిచే యంత్రం(Time Machine) కథాంశంతో రూపొందిన ఈ మూవీ అటు శాస్త్రీయంగా ఉండటమే కాకుండా ఇటు వైపు జానపద, పౌరాణిక కోణాన్ని కూడా ఆవిష్కరించింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్స్​ను పోషించాడు. అయితే మొదట దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని మల్టీ స్టారర్​గా తీయాలనుకున్నారట. బాలకృష్ణతో పాటు మరోహీరో కూడా ఫైనల్ అయ్యాడట. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరో తెలుసా?

ఆదిత్య 369 చిత్రంలో బాలయ్య కృష్ణ కుమార్, శ్రీకృష్ణదేవరాయలు పాత్రల్లో కనిపించారు. ఇందులో రెండు పాత్రలకు ఆయన తగిన న్యాయం చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో బాలకృష్ణను కాకుండా మరో హీరోను ఊహించుకోలేం. అందుకే దర్శకనిర్మాతలు కూడా ఆ పాత్రకు బాలయ్యే న్యాయం చేయగలరని ఆయనను సంప్రదించారు. అయితే ఇందులో మరో క్యారెక్టరైన కృష్ణ కుమార్ పాత్రకు కమల్ హాసన్​ను తీసుకోవాలని అనుకున్నారట. ఈ ఇద్దరితో మంచి మల్టీస్టారర్ అవుతుందని భావించారట. కానీ కమల్ అప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమా వదులుకున్నారట. దీంతో చివరకు బాలయ్యే రెండు పాత్రలు పోషించాల్సి వచ్చింది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే కమల్ హాసన్ నటించి ఉంటే ఈ అద్భుత చిత్రం ఇంకెలా ఉండేదో ఆలోచించుకోండి.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్​పై ఎస్. అనితా కృష్ణ నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు ఆణిముత్యాలే. బాలకృష్ణ సరసన మోహినీ నటించగా.. అమ్రీశ్ పూరీ ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు.

ఇటీవలే బాలయ్య నటించిన అఖండ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రగ్వా జైస్వాల్, శ్రీకాంత్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహించాడు. బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వచ్చిన మూడో చిత్రం అఖండ.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం