Dhanush: ది గ్రే మ్యాన్ సీక్వెల్.. ధనుష్ పాత్ర ‘లోన్ వూల్ఫ్‌’పై సినిమా-dhanush officially announces avik san return in the gray man sequel ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush: ది గ్రే మ్యాన్ సీక్వెల్.. ధనుష్ పాత్ర ‘లోన్ వూల్ఫ్‌’పై సినిమా

Dhanush: ది గ్రే మ్యాన్ సీక్వెల్.. ధనుష్ పాత్ర ‘లోన్ వూల్ఫ్‌’పై సినిమా

Maragani Govardhan HT Telugu
Aug 06, 2022 06:39 PM IST

ధనుష్ నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్. ఈ సినిమాలో అతడు అవిక్ సాన్ పాత్రలో కనిపించాడు. ఈ పాత్రకు సీక్వెల్ రాబోతున్నట్లు ధనుష్ అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఆడియే క్లిప్‌ను కూడా విడుదల చేశాడు.

<p>ది గ్రే మ్యాన్ చిత్రంలో ధనుష్</p>
ది గ్రే మ్యాన్ చిత్రంలో ధనుష్ (HT_PRINT)

అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాంటి భారీ సూపర్ హిట్ చిత్రాలను తెరెకెక్కించిన రూసో బ్రదర్స్.. ఈ ఏడాది ది గ్రే మ్యాన్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసింది. గత నెలలో ఇది ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. అవిక్ సాన్(ది లోన్ వూల్ఫ్) అనే పాత్రలో కనిపించిన ధనుష్.. తన ఎంట్రీతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీంతో అతడి పాత్రతోనే మరో సీక్వెల్‌ను తీస్తామని రూసో బ్రదర్స్ ఇప్పటికే తెలిపారు. తాజాగా ధనుష్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

"ది గ్రే మ్యాన్ యూనివర్స్‌లో సీక్వెల్ రాబోతుంది. అవిక్ సాన్ అలియస్ ది లోన్ వూల్ఫ్ త్వరలో రాబోతున్నాడు. సిద్ధంగా ఉండండి" అంటూ ధనుష్ ట్విటర్ వేదికగా పోస్టు చేశారు. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ది గ్రే మ్యాన్ ప్రధాన పాత్రదారి సియర్రా సిక్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లున్న వాయిస్ క్లిప్‌ను ధనుష్ జోడించారు.

"సిక్స్.. లోన్ వూల్ఫ్‌ను మాట్లాడుతున్నాను. మనమిద్దరం ఒకే వ్యక్తిని వెతుకుతున్నామని విన్నాను. నేను నీకు ఓ సలహా ఇద్దామనుకుంటున్నా. అతడిని వెతకడం ఆపు. నీ సమయాన్ని నువ్వు వృథా చేసుకుంటున్నావ్. ఎందుకంటే అతడిని నేను ముందు పట్టుకున్నానంటే నువ్వు వెతకాడానికి ఏమి ఉండదు. అదే నువ్వు ముందు పట్టుకుంటే.. నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను. పర్సనల్‌గా తీసుకోవద్దు." అంటూ ధనుష్ సియర్రా సిక్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లున్న ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు.

ది గ్రే మ్యాన్ చిత్రాన్ని 2009లో మార్క్ గ్రేనీ అదే పేరుతో రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. సీఐఏ కాంట్రాక్ట్ ఏజెన్సీ సియార్రా స్పై సియార్రా సిక్స్‌ (ర్యాన్ గాస్లింగ్‌)ను తన మాజీ సహచరుచు ఫ్లాయడ్ హాన్సెన్(క్రిస్ ఇవాన్స్) వెతుకుతుంటాడు. ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్‌లో ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్‌తో పాటు ధనుష్, యానా డే ఆర్మాస్, రేజె జీన్ పేజ్, జెస్సికా హెన్విక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ది గ్రే మ్యాన్ చిత్రం చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా భారతీయ అభిమానులు ధనుష్ క్యారెక్టర్ ది లోన్ వూల్ఫ్‌ను బాగా ఇష్టపడ్డారు. దీంతో చిత్ర దర్శకులు రూసో బ్రదర్స్ ధనుష్ పాత్రను విస్తరిస్తూ సీక్వెల్‌కు రూపకల్పన చేస్తామని గతంలోనే ప్రకటించారు. తాజాగా మరోసారి ధనుష్ ఈ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

Whats_app_banner

సంబంధిత కథనం