Telugu News  /  Entertainment  /  Deepika Padukone Clarity On Divorce With Ranveer Singh Rumours
రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె
రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె (Twitter)

Deepika Reaction On Divorce: రణ్‌వీర్‌తో విడాకులపై దీపిక క్లారిటీ.. ఎట్టకేలకు స్పందించిన ముద్దుగుమ్మ

13 October 2022, 22:12 ISTMaragani Govardhan
13 October 2022, 22:12 IST

Deepika Reaction On Divorce: గత కొన్ని రోజులుగా దీపికా-రణ్‌వీర్ విడాకుల తీసుకుంటున్నారనే రూమర్లు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై దీపిక ప్రతిస్పందించింది. అవన్నీ వట్టి కల్పితాలని తేల్చి చెప్పింది.

Deepika Reaction On Divorce: చాలా వరకు అందరి చూపు సెలబ్రెటీలపైనే ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఎవరైనా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నా, పెళ్లి చేసుకోబోతున్నా చివరకు వారు విడాకులు తీసుకోబోతున్నా.. ప్రతి విషయాన్ని హాట్ టాపిక్‌గా చేసేస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి రూమర్లు మరింత ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్ దంపతులు రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం కారణంగా.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, చివరకు అవి విడాకుల వరకు వెళ్లాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఇప్పటి వరకు ఈ పుకార్లపై రణ్‌వీర్-దీపిక స్పందించలేదు. ఈ వార్తలపై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమ విడాకుల రూమర్లపై దీపికా పదుకొణె స్పందించింది. ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న దీపికాకు ఓ విలేకరు నుంచి విడాకులపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదని, అవన్నీ వట్టి రూమర్లన్నీ కొట్టిపారేసింది.

మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. గత వారం రణ్‌వీర్ ఓ మ్యాజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి రాగానే నన్ను చూసి పట్టలేనంత ఆనందాన్ని చూపించాడు. అంటూ విడాకులపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది.

ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన రణ్‌వీర్-దీపిక 2018 నవంబరులో పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకుంటున్నారు. తాజాగా విడాకులు తీసుకుంటున్నానే వార్తలు రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక సినిమాల విషయానికొస్తే దీపికా షారుఖ్‌తో పఠాన్, ప్రభాస్‌తో ప్రాజెక్ట్ కే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.