Bloody Daddy Review: బ్లడీ డాడీ మూవీ రివ్యూ ‍- క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ యాక్టింగ్‌ ఎలా ఉందంటే?-bloody daddy movie telugu review shahid kapoor action thriller movie streaming on jio cinema ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bloody Daddy Review: బ్లడీ డాడీ మూవీ రివ్యూ ‍- క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ యాక్టింగ్‌ ఎలా ఉందంటే?

Bloody Daddy Review: బ్లడీ డాడీ మూవీ రివ్యూ ‍- క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ యాక్టింగ్‌ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu
Jun 12, 2023 10:16 AM IST

Bloody Daddy Review: షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ బ్ల‌డీ డాడీ జియో సినిమా ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే...

షాహిద్ క‌పూర్
షాహిద్ క‌పూర్

Bloody Daddy Review: షాహిద్ క‌పూర్‌, డ‌యానా పెంటీ, రోనిత్ రాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ మూవీ బ్ల‌డీ డాడీ. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ మూవీ డైరెక్ట్‌గా జియో సినిమా ఓటీటీలో రిలీజైంది. స్పానిష్ థ్రిల్ల‌ర్ స్లీప్‌లెస్ నైట్స్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? యాక్ష‌న్ రోల్‌లో షాహిద్ క‌పూర్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అన్న‌ది చూద్దాం...

యాభై కోట్ల డ్ర‌గ్స్‌....

సుమేర్ (షాహిద్ క‌పూర్‌) నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. త‌న స‌హ ఉద్యోగి జ‌గ్గితో క‌లిసి యాభై కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకుంటాడు సుమేర్‌. ఆ డ్ర‌గ్స్ సికింద‌ర్ (రోనిత్ రాయ్‌) అనే డ్ర‌గ్ డీల‌ర్‌కు చెందిన‌వి. వాటి కోసం సుమేర్ కొడుకు అథ‌ర్వ్‌ను కిడ్నాప్ చేస్తాడు సికింద‌ర్‌. డ్ర‌గ్స్ బ్యాగ్ ఇచ్చి కొడుకు తీసుకెళ్ల‌మ‌ని సుమేర్‌ను బెదిరిస్తాడు. అథ‌ర్వ్‌ను ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో బంధిస్తాడు సికింద‌ర్‌.

కొడుకు కోసం ఆ హోట‌ల్‌కు యాభై కోట్ల డ్ర‌గ్స్‌తో అడుగుపెట్టిన సుమేర్‌కు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? అత‌డి ద‌గ్గ‌ర నుంచి ఆ డ్ర‌గ్స్ బ్యాగ్ ఎలా మాయ‌మైంది? సికింద‌ర్ బారి నుంచి కొడుకును సుమేర్ కాపాడుకున్నాడా?

సుమేర్ ద‌గ్గ‌ర ఉన్న డ్ర‌గ్స్‌తో గ్యాంగ్‌స్ట‌ర్ హ‌మీద్‌కు (సంజ‌య్ క‌పూర్‌) ఎలాంటి సంబంధం ఉంది? సుమేర్‌ను అరెస్ట్ చేయ‌డానికి ఆ హోట‌ల్‌కు వ‌చ్చిన పోలీస్ ఆఫీస‌ర్స్ స‌మీర్ (రాజీవ్ ఖండేవాల్‌), అదితి (డ‌యానా పెంటీ)లు మంచివాళ్ల‌? చెడ్డ‌వాళ్ల అన్న‌దే బ్ల‌డీ డాడీ క‌థ‌.

సింగిల్ నైట్ క‌థ‌..

బ్ల‌డీ డాడీ సింగిల్ నైట్‌లో జ‌రిగే క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ. త‌న కొడుకును కాపాడుకోవ‌డానికి ఓ తండ్రి సాగించిన పోరాటానికి డ్ర‌గ్స్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఈ సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్‌. బ్ల‌డీ డాడీ క‌థ మొత్తం ఒకే ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో సాగుతుంది. ఇలాంటి క‌థ‌ల‌కు రేసీ స్క్రీన్‌ప్లేతో పాటు ఆడియెన్స్ ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌లు ఉండ‌టం ముఖ్యం. అలాంటి స‌ర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లేవీ ఈ సినిమాలో క‌నిపించ‌వు.

ఎంగేజింగ్‌గా...

సుమేర్ డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకోవ‌డంతోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. కొడుకుతో సుమేర్‌కు ఉన్న అనుబంధంతో పాటు బాధ్య‌తారాహిత్యం కార‌ణంగా భార్య అత‌డికి విడాకులు ఇచ్చిన‌ట్లుగా ఒక‌టి, రెండు సీన్స్‌లో చూపించారు. సుమేర్ ప‌ట్టుకున్న డ్ర‌గ్స్ కోసం అత‌డి కొడుకు అథ‌ర్వ్‌ను సికింద‌ర్ కిడ్నాప్ చేయ‌డంతోనే అస‌లు క‌థలోకి ఎంటర్ అవుతుంది మూవీ.

సుమేర్ ద‌గ్గ‌రున్న డ్ర‌గ్స్ బ్యాగ్‌ను సికింద‌ర్‌, హ‌మీద్‌, స‌మీర్ ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రు కొట్టాయాల‌ని చూసే సీన్స్‌తో క‌థ‌ను చివ‌రి వ‌ర‌కు ఎంగేజింగ్‌గా న‌డిపించాల‌ని ప్ర‌య‌త్నించారు డైరెక్ట‌ర్‌. వారి కార‌ణంగా సుమేర్ లైఫ్ ఎలా ఇబ్బందుల్లో ప‌డింద‌న్న‌ది యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ద్వారా చూపించారు.

క‌మ‌ల్ రీమేక్‌...

బ్ల‌డీ డాడీ క‌థ‌కు ఫాద‌ర్‌, స‌న్ ఎమోష‌న‌ల్ బాండింగ్ కీల‌కం. ఆ ఎమోష‌న్స్‌ను స‌రిగా స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేయ‌లేక‌పోయారు డైరెక్ట‌ర్‌. చిన్న సినిమానే అయినా చాలా చోట్ల లాగ్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో థ్రిల్‌, ఇంటెన్సిటీ మిస్స‌య్యాయి ఎడింగ్ కూడా ప్రెడిక్ట‌బుల్‌గా సాగింది.బ్ల‌డీ డాడీ 2011లో రిలీజైన స్లీప్‌లెస్ నైట్స్ అనే స్పానిష్ థ్రిల్ల‌ర్ మూవీకి రీమేక్‌గా రూపొందించారు. ఇదే సినిమాను క‌మ‌ల్‌హాస‌న్ కూడా తూంగ‌వ‌నం పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులోనూ చీకటి రాజ్యంగా రిలీజైంది. ఆ సినిమాను చూసిన వారికి బ్ల‌డీడాడీ అంతగా న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

షాహిద్ క‌పూర్ యాక్టింగ్ ప్ల‌స్‌...

కొడుకును ర‌క్షించుకోవ‌డం కోసం ఆరాట‌ప‌డే తండ్రిగా ఎమోష‌న‌ల్ రోల్‌లో షాహిద్ క‌పూర్ యాక్టింగ్ బాగుంది. సీరియ‌స్ రోల్‌లో త‌న‌దైన మార్కు యాక్టింగ్‌ను చూపించారు. డ్ర‌గ్స్ మాఫియా లీడ‌ర్స్‌గా రోనిత్ రాయ్‌, సంజ‌య్ క‌పూర్ పాత్ర‌ల‌ను స్టైలిష్‌గా డిజైన్ చేశారు. రాజీవ్‌, డ‌యానా పెంటీ, స‌ర్తాజ్ క‌క్క‌ర్ యాక్టింగ్ ఒకే.

ఔట్‌డేటెడ్ స్టోరీ...

బ్ల‌డీ డాడీ యాక్ట‌ర్‌గా షాహిద్ క‌పూర్‌లోని వేరియేష‌న్‌ను చూపించ‌డానికే ఉప‌యోగ‌ప‌డింది త‌ప్పితే ఇందులో ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. కంప్లీట్ ఔట్‌డేటెడ్ పాయింట్‌తో తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను మెప్పించడం కష్టమే…

IPL_Entry_Point