Bigg Boss Elimination: షాకింగ్.. సండే కాకుండా ఇవాళే ఎలిమినేషన్.. మళ్లీ అమ్మాయే ఔట్
Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం ఎలిమినేషన్లో షాకింగ్ ట్విస్ట్ జరగనుంది. సాధారణంగా ఆదివారం అయ్యే ఎలిమినేషన్ శుక్రవారం జరగనుంది. అయితే, ఈసారి కూడా మళ్లీ లేడి కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని టాక్. ఇంతకీ ఆమె ఎవరనే విషయంలోకి వెళితే..
Bigg Boss 7 Telugu 7th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్లు అయితే చాలా రంజుగా సాగాయి. గొడవలు, అరుపులు, బూతులతో హౌజ్ దద్దరిల్లి పోయింది. ఎక్కువగా సింగర్ భోలేకు నామినేషన్ ఓట్లు పడ్డాయి. అలా ఏడో వారం మొత్తంగా ఏడుగురు నామినేషన్లలో ఉన్నారు. బిగ్ బాస్ 7 తెలుగు 7వ వారం భోలే షావలి, అశ్విని శ్రీ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ నామినేట్ అయ్యారు.
నామినేట్ అయిన వాళ్లలో మొదటి రోజు నుంచి పల్లవి ప్రశాంత్ అత్యధిక ఓట్లతో ముందు వరుసలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్‌కు 45 శాతం ఓట్లు పడుతూ వచ్చాయి. తర్వాతి రెండో స్థానంలో అమర్ దీప్ చౌదరి ఉన్నాడు. మూడో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. అయితే, గొడవ, బూతులు కారణంగా సింగర్ భోలే మొదటి రోజు డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ, తర్వాత మాత్రం అతనికి ఓట్ బ్యాంక్ పెరిగింది. దీంతో అతనికి నాలుగో స్థానం వచ్చింది.
ఐదో స్థానంలో టేస్టీ తేజ కొనసాగాడు. ఇక ఆరు, ఏడు వంటి స్థానాలతో అశ్విని శ్రీ, పూజా మూర్తి డేంజర్లో ఉన్నారు. కాగా సాధారణంగా సండే రోజున ఎలిమినేట్ చేస్తారు. దానికి సంబంధించిన షూటింగ్‌ను శనివారం చిత్రీకరిస్తారు. కానీ, బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్ ప్రక్రియను ఇవాళే అంటే శుక్రవారం (అక్టోబర్ 20)న చిత్రీకరించనున్నారు. శనివారం రోజు ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను హౌజ్ నుంచి పంపిస్తారు. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నమాట.
దసరా ఫెస్టివల్ సందర్భంగా ఆదివారం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందట బిగ్ బాస్. అందుకే ఆరోజు కాకుండా శనివారం రోజునే ఎలిమినేషన్ చేయనున్నారట. ఇదిలా ఉంటే ఎలిమినేషన్ అయ్యే అవకాశం పూజా మూర్తికి కనిపిస్తోంది. మొదట్లో ఈ వారం భోలే ఎలిమినేట్ అవుతారనుకున్నారు. కానీ, అతనికి ఊహించని విధంగా ఓటింగ్ పెరిగింది. ఈవారం అమ్మాయిలను ఎలిమినేట్ చేయాలని లేకుంటే.. తేజ లేదా భోలేలో ఒకరు హౌజ్ వీడాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.