Bigg Boss Telugu: అమర్ దీప్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. రాత్రంతా నస.. నాగార్జునకు నిజం చెప్పిన ప్రియాంక-bigg boss 7 telugu priyanka confess she was emotional blackmailed by amardeep ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu: అమర్ దీప్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. రాత్రంతా నస.. నాగార్జునకు నిజం చెప్పిన ప్రియాంక

Bigg Boss Telugu: అమర్ దీప్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్.. రాత్రంతా నస.. నాగార్జునకు నిజం చెప్పిన ప్రియాంక

Sanjiv Kumar HT Telugu
Dec 03, 2023 11:04 AM IST

Bigg Boss Telugu Priyanka Jain: బిగ్ బాస్ 7 తెలుగు ఫినాలే టాస్క్‌ సమయంలో తనను అమర్ దీప్ చౌదరి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పింది ప్రియాంక జైన్. గౌతమ్‌కు ఇచ్చిన పాయింట్స్ అమర్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న నాగార్జున ప్రశ్నకు నిజం చెప్పింది.

బిగ్ బాస్ 7 తెలుగు: ప్రియాంకను బ్లాక్ మెయిల్ చేసిన అమర్ దీప్.. నాగార్జున ముందు నిజం చెప్పిన వంటలక్క
బిగ్ బాస్ 7 తెలుగు: ప్రియాంకను బ్లాక్ మెయిల్ చేసిన అమర్ దీప్.. నాగార్జున ముందు నిజం చెప్పిన వంటలక్క

Bigg Boss 7 Telugu Day 90 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు డిసెంబర్ 2వ తేదిన హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల ఆట తీరుపై మాట్లాడాడు. ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు, ఎవరు కష్టపడి ఆడారో రివ్యూ చేశాడు నాగార్జున. ముందుగా శివాజీని లేపిన నాగార్జున ఏమైందని అడిగారు. చేయి నొప్పి వల్ల సరిగ్గా ఆడలేకపోయాను అని శివాజీ బదులిచ్చాడు.

అసలైన టికెట్ టు ఫినాలే టాస్క్‌లో శివాజీ, శోభా శెట్టి వెనుక పడిపోయారు. మరి మీ పాయింట్స్ అమర్ దీప్‌కు ఎందుకు ఇచ్చారు అని నాగార్జున అన్నాడు. ఇదివరకు నేను మాట ఇచ్చాను కదా సార్ అందుకు అని శివాజీ అంటే.. అంతేనా లేకా అమర్ అలుగుతాడనా అని నాగార్జున క్వశ్చన్ చేశాడు. లేదు సార్ వాడు అలగడు అని శోభా చెప్పింది. దీంతో ఏంటీ అలగడా అని నాగ్ షాక్ అయ్యాడు.

నాతో అలగడు సార్ అని శోభా చెప్పింది. ఏంటీ ప్రియాంక అమర్ దీప్ అలగడా అని అడిగాడు నాగార్జున. చాలా తలనొప్పిగా ఉంది దాని గురించి ఆలోచిస్తుంటే అని ప్రియాంక అంది. పదే పదే అదే లూప్ కదా అని నాగ్ అంటే.. అవును సార్ అంది. అనంతరం చాలా బాగా ఆడావ్, కష్టపడ్డావ్, నీ హండ్రెడ్ పర్సంట్ ఇచ్చావని ప్రియాంకను మెచ్చుకున్నాడు నాగ్. బాస్కెట్ బాల్ టాస్క్‌లో ఎందుకు ఓడిపోయావని అనుకుంటున్నావ్ అని నాగ్ అడిగాడు.

సంచాలకులు పెట్టిన రూల్ వల్ల అని ప్రియాంక అంది. ఆ బాధతోనే పాయింట్స్ అన్నీ గౌతమ్‌కు ఇచ్చావ్ అని నాగ్ అంటే.. బాధతో కాదు కృతజ్ఞతతో అని ప్రియాంక అంది. మరి కృతజ్ఞతతో ఇస్తే మళ్లీ అమర్‌కు ఎందుకు ఇవ్వమన్నావని నాగ్ అడిగారు. అప్పుడు నా మైండ్‌లో ఇద్దరు ఉన్నారు అని ప్రియాంక చెబుతుంటే అమర్ నిన్ను బ్లాక్ మెయిల్ చేశాడా, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని నాగ్ అడిగారు. దాంతో అవును సార్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని ప్రియాంక చెప్పింది.

కాగా టికెట్ టు ఫినాలే టాస్క్ సమయంలో ప్రియాంక పాయింట్స్ తనకు ఇవ్వకుండా గౌతమ్‌కు ఇచ్చాడని అమర్ దీప్ రోజంతా అలిగే ఉన్నాడు. తర్వాత రోజు కూడా ప్రియాంక పాయింట్స్ ఇస్తే ఎక్కడో ఉండేవాన్ని అంటూ పదే పదే మాటలు అన్నాడు. ఆ బాధ భరించలేకే గౌతమ్ ఓడిపోయినప్పుడు ఆ పాయింట్స్ అమర్‌కి ఇచ్చేయమని గౌతమ్‌కు చెప్పింది ప్రియాంక.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ హౌజ్ లో ఎక్కువగా కిచెన్ లో ఉంటూ వంటలక్కగా పేరు తెచ్చుకుంది ప్రియాంక జైన్. మొదట్లో సింగర్ దామిని భట్ల వంటలక్కగా ఉండేది. ఆమె ఎలిమినేషన్ తర్వాత చిన్న వంటలక్కగా ప్రియాంక మారింది.

Whats_app_banner