Telugu News  /  Entertainment  /  Bigg Boss 6 Telugu Day 17 Episode 18 Inaya And Revanth Fire On Housemates
బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 18
బిగ్‌బాస్ 6 ఎపిసోడ్ 18

Bigg Boss 6 Telugu Episode 18: ఫిజికల్ అయిన ఇనాయా.. చెంపపై కొట్టి.. కాలితో తన్ని.. దొంగల టీమ్‌పై రేవంత్ ఫైర్..!

22 September 2022, 6:37 ISTMaragani Govardhan
22 September 2022, 6:37 IST

Bigg Boss 6 Telugu Day 17 Episode 18: ఈ రోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ టాస్క్ నియమాల గురించి మరోసారి వివరించే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ కాస్త ముందుకు నడిచింది. తనను కిడ్మాప్ చేసినందుకు గానూ.. ఇనాయా ఇంటి సభ్యులతో ఫిజికల్ కాగా.. రేవంత్ తన బొమ్మలను దొంగిలించినందుకు సీరియస్ అయ్యాడు.

Bigg Boss 6 Telugu Day 17 Episode 18: బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారం కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ రసవత్తరంగా జరుగుతోంది. పోలీసులు, దొంగలు, అత్యాశ పరురాలైన వ్యాపారస్తురాలు ముడూ కేటగిరీల్లో ఇంటి సభ్యులు ఈ టాస్క్‌లో పోటీ పడుతున్నారు. తొలి రోజు టాస్క్‌లో ఇంటి సభ్యులు రూల్స్ మర్చిపోయి మరీ ఎవరి గేమ్ వారు ఆడారు. గీతూ తన రూల్స్‌ను పూర్తిగా మార్చేసింది. దొంగల దగ్గర నుంచే బొమ్మలను కొట్టేసింది. పోలీసులు తము కాపాడాల్సిన వస్తువులను దొంగతనం చేసి జాగ్రత్తగా మూటగట్టుకున్నారు. దీంతో బిగ్‌బాస్ టాస్క్ గురించి వివరించే ప్రయత్నం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

పోలీసులు రైడ్‌కు వెళ్లినప్పుడు దొంగలను పట్టుకోవచ్చు. రైడ్ టైమ్ ముగిసిన తర్వాత పోలీసులు ఇంట్రోనే ఉంటే దొంగలు వారిని కిడ్నాప్ చేయవచ్చు. దీంతో దొంగలు అడవిలో వస్తువులను దొంగతనం చేస్తున్నా.. పోలీసులు చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అడవిలో ఉన్న వస్తువున్నింటినీ దొంగలు దొంగిలించిన తర్వాత హౌస్‌లో వివిధ రకాల ప్రదేశాల్లో దాచిపెట్టారు. రైడ్‌కు వచ్చిన పోలీసులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముందుగా ఇనాయా సుల్తానాను దొంగలు కిడ్నాప్ చేశారు.

ఫిజికల్ అయిన ఇనాయా..

దీంతో ఇనాయా వారి నుంచి తప్పించుకునేందుకు గట్టిగా ప్రయత్నించింది. కాళ్లతో తన్నడం, లాక్కోవడం లాంటివి చేసేసరికి.. ఇంటి సభ్యులకు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా నేహా తనను ఇనాయా చెంపపై కొట్టిందని వాపోయింది. గేమ్‌లో భాగంగా పట్టుకుంటే అంతలా కొట్టాలా? అంటూ పంచాయితీ పెట్టింది. ఇప్పటికే ఓ సారి గాయపడ్డ తనను ఇలా మరోసారి కొట్టడమేంటని, నిన్న తనను డ్రామా క్వీన్ అని చెప్పి ఇప్పుడు ఆమెనే కొట్టి అలా ఏడ్వడం సరికాదంటూ గట్టిగా విమర్శించింది. ఆరోహీని కాలితో తన్నినట్లు ఆమె స్పష్టం చేసింది. అయితే ఇనాయా తనను తాను తప్పించుకునే క్రమంలో కొట్టిందో లేదా కావాలనే కొట్టిందో తెలియదు.. కానీ హౌస్‌లో ఇంటి సభ్యులతో గట్టిగానే గొడవ పడింది. తన డ్రెస్‌ను ఎవరో పైకి లాగేశారని, తీసేసారంటూ ఆరోపించింది. అయితే అలా అస్సలు జరగలేదని, ఇవన్నీ తప్పు మాటలని గీతూ మధ్యలో దూరేసింది. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావ్ అంటూ ఇనాయాను గట్టిగా క్లాస్ పీకింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఎప్పటిలానే మరోసారి జరిగింది.

సిగ్గూ-శరం లేదంటూ రేవంత్ ఫైర్..

రేవంత్..గీతూకు బొమ్మలను అమ్ముకోవడం సహించలేని నేహా, ఆరోహి అతడి బొమ్మలను ఎలాగైన దొంగిలించాలని పన్నాగం పన్నుతారు. అనుకున్నట్లునే అతడు దాచుకున్న బొమ్మల్లో కొన్నింటిని తీసుకుని దాచేస్తారు. తన బొమ్మలను ఎవరో దొంగిలించారని రేవంత్ తనదైన శైలిలో ఊగిపోయాడు. సొంత టీమ్‌లో వారే ఎలా కొట్టేస్తారంటూ ఫైర్ అయ్యాడు. తన బొమ్మలను తీసినవారికి సిగ్గూ, శరం ఉండదని, మళ్లీ నీతులు మాట్లాడతారని గొంతుకను పెంచి మాట్లాడాడు. తనకు దొంగల టీమ్ సపోర్ట్ చేయలేదు కాబట్టి.. తన వద్ద ఉన్న బొమ్మలను పోలీసుల టీమ్‌కు ఇస్తానని, వారిని టాస్క్‌లో గెలిపిస్తానని స్పష్టం చేశాడు. మరోపక్క తేలు కుట్టిన దొంగల మాదిరిగా నేహా, ఆరోహి సైలెంట్‌గా ఉండిపోతారు.

మరోపక్క గీతూ.. కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు తన గేమ్ ప్లాన్‌ను పూర్తిగా మార్చేసింది. తన బొమ్మలను కాపాడుకునేందుకు సూర్య, శ్రీహాన్‌తో డీల్ కుదుర్చుకుంది. ఇందుకోసం తన వద్ద కావాల్సినంత డబ్బు పెట్టుకుని, మిగిలినవి వారిద్దరికీ పంచేసింది. బుధవారం నాటి ఆట ముగిసే సమయానికి శ్రీహాన్, సూర్యల వద్దే ఎక్కువ డబ్బులున్నట్లు తెలుస్తోంది.

టాపిక్