Telugu News  /  Entertainment  /  Third Week Captaincy Contender Task Bigg Boss 6 Telugu Episode 17 In 2022 September 20
బిగ్‌బాస్ ఎపిసోడ్ 17
బిగ్‌బాస్ ఎపిసోడ్ 17 (Twitter)

Bigg Boss 6 Telugu Episode 17: ఇనాయాను కొడతానన్న రేవంత్.. కెప్టెన్సీ టాస్క్‌లో ఓ రేంజ్‌లో గొడవలు..!

21 September 2022, 8:07 ISTMaragani Govardhan
21 September 2022, 8:07 IST

Bigg Boss 6 telugu Episode 17: బిగ్‌బాస్.. అడవిలో దొంగలుపడ్డారు అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఇంటి సభ్యులను రెండు వర్గాలుగా విడగొట్టి ఓ రేంజ్‌లో గొడవలు పెట్టారు బిగ్‌బాస్. ఇనాయా-రేవంత్ మధ్య తీవ్రంగా వాదన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Bigg Boss 6 Telugu Third week Captaincy Contender Task: బిగ్‌బాస్ షోలో సోమవారం ఎపిసోడ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అనుకున్నట్లుగానే మూడో వారం ఎలిమినేషన్ కోసం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్స్‌లో గొడవలు ఓ రేంజ్‌లో జరిగాయి. అయితే అదే గొడవలు మంగళవారం కూడా కొనసాగాయి. ఎపిసోడ్ ప్రారంభంలో నామినేషన్స్ హీట్ గురించి చర్చించుకున్న ఇంటి సభ్యులు ఓదార్పు యాత్రను చేపట్టారు. నేహా చౌదరి నామినేషన్స్‌లో రేవంత్‌తో జరిగిన గొడవ గురించి హర్ట్ అయి ఏడ్చింది. అనంతరం సంబంధం లేకుండా ఎందుకు ఏడ్చిందో తెలియని కీర్తిని ఆరోహి ఓదార్చింది. మరోపక్క ఆదిరెడ్డి, గీతూలు పక్క పక్కన కూర్చుని ఇనాయా సుల్తానా గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇనాయ తిక్కది, దెయ్యం అంటూ గీతూ నోరుపారేసుకోగా.. ఆదిరెడ్డి ఆమెకు ఎలా మాట్లాడాలో తెలియదు అంటూ గీతూకు వంక పాడాడు. కంటెంట్ ఇవ్వడం కోసం స్ట్రాటజీలు ప్లే చేస్తుందని స్పష్టం చేశాడు.

మరోపక్క ఇంతవరకు టాస్కుల్లో ఎలాంటి టాలెంట్ చూపని శ్రీ సత్య మాత్రం.. తను ఇక్కడకు వచ్చింది మనీ, ఫేమ్ కోసమే అంటూ కుండబద్దలుకొట్టింది. హౌస్‌లో ఉన్నవాళ్లంతా నానుంచి జీరో పర్సెంట్ తీసుకుంటారు అని స్పష్టం చేసింది. నా నుంచి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేసినా రాదని తెలిపింది. ఆర్జే సూర్య తనను టార్గెట్ చేస్తున్నాడని రేవంత్ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్.. అడవిలో దొంగలు..

ఇప్పటి వరకు ఓదార్పు యాత్రలు, ఏడుపులు, పెడబొబ్బులు జరుగ్గా.. అసలు రచ్చ ఇప్పుడే మొదలైంది. బిగ్‌బాస్.. అడవిలో దొంగలుపడ్డారు అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఆదిరెడ్డి, మెరీనా-రోహిత్, శ్రీసత్య, ఫైమా, ఇనాయా, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్‍‌లు పోలీసుల టీమ్ కాగా.. రేవంత్, ఆరోహి, సుదీప, వాసంతి, నేహా, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్‌లు దొంగలుగా.. గీతూను అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా బిగ్‌బాస్ సెలక్ట్ చేశారు. పోలీసుల హెడ్‌గా ఆదిరెడ్డి, దొంగల హెడ్‌గా సూర్యను ఎంపిక చేశారు. పోలీసులు అడవిలో ఉన్నప్పుడు వస్తువులను దొంగిలించాలి.. అలాగే వాటిని పోలీసులు కాపాడుకోవాలి. దొంగలు ఆ వస్తువులను వ్యాపారస్తురాలైన గీతూకు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి. ఇక్కడ కిడ్నాప్‌లు, పోలీసులు దొంగలను ఖైదు చేయడం లాంటి ట్విస్టులు కూడా ఉన్నాయి.

రూల్స్ మార్చేసిన గీతూ..

గత వారం టాస్క్‌లో బొమ్మలను దొంగతనం చేసి నాగార్జునతో ప్రశంసలు అందుకున్న గీతూ.. ఈ సారి పప్పులో కాలేసినట్లు అనిపిస్తుంది. వ్యాపారస్తురాలు దొంగల నుంచి బొమ్మలు కొనుగోలు చేయాలని మాత్రమే బిగ్‌బాస్ చెప్పారు. కానీ ఇందుకు విరుద్ధంగా గీతూ.. ముందుగానే బొమ్మలను దొంగతనం చేసిన తన దగ్గర పెట్టుకుంది. పైపెచ్చు నాకోసమే ఇలాంటి టాస్క్‌లు ఇస్తావా బిగ్‌బాస్ అంటూ ఇతర ఇంటి సభ్యుల మాటాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆట మొదలుకాకుండా తన స్ట్రాటజీతో బొమ్మలను దొంగతనం చేసింది.

పోలీసు బాస్‌గా ఉన్న ఆదిరెడ్డి.. దొంగల మాదిరిగా మనం కూడా బొమ్మలను దాచిపెట్టుకోవాలని, వాళ్లని బోల్తా కొట్టించాలని చెప్పాడు. ఇక ఆరోహి పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తానని ఫైమాతో డీల్ కుదుర్చుకుంటుంది. ఆట స్టార్ట్ అయిన తర్వాత బాలాదిత్య.. నేహా కాలును పట్టుకోగా.. తనకు నొప్పి వస్తుందని నేహా ఏడ్వడం ప్రారంభించింది. వెంటనే ఆమెను హౌస్‌లోకి తీసుకెళ్తారు.

టాస్క్ ప్రారంభమైన తర్వాత ఇరువురు ఇంటి సభ్యులు బిగ్‌బాస్ ఇచ్చిన రూల్స్‌ను పట్టించుకోలేదని తెలుస్తోంది. బొమ్మల కోసం దొంగలు తీవ్రంగా ప్రయత్నించగా.. వారిని ఆపడం కోసం పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పడటం, తోసుకోవడం ఒళ్లు హూనమయ్యేలా ప్రయత్నించారు.

ఇనాయా-రేవంత్ గొడవ..

ఈ సమయంలోనే వీడు లాక్కున్నాడని ఇనాయా.. శ్రీహాన్‌పై నోరు పారేసుకుంది. వాడు, వీడు ఎలా అంటావ్ నువ్వు అంటూ శ్రీహాన్ రెచ్చిపోయాడు. మధ్యలో రేవంత్ వచ్చి.. మొన్న కూడా నన్ను అన్నది చెత్తది.. అప్పుడే కొట్టేద్దాం అనుకున్నా అంటూ తెగ రెచ్చిపోయాడు. ఎలా కొడతావో చూపించు అంటూ ఇనాయా కూడా ఇంకాస్త రెచ్చగొట్టింది. పదే పదే వాడు వాడు అంటూ ఎదురుదాడికి దిగింది. నీకు మీ ఇంట్లో మేనర్స్ నేర్పించలేదా అంటూ రేవంత్ నోరు జారడం మొదలుపెట్టాడు. అసలే మనోడికి నోరు కుదురదనే టాక్ ఉంది. అలాంటిది ఇప్పుడు తనది కాని గొడవలో దూరి ఇంకాస్త కెలుక్కున్నాడు. తర్వాత శ్రీహాన్‌కు ఇనాయా సారీ చెప్పింది. ఇందుకు శ్రీహాన్ కూడా సానుకూలంగానే స్పందించాడు. మధ్యలో రెచ్చిపోయిన రేవంత్ మాత్రం నోరు జారి ఆడియెన్స్‌కు దొరికిపోయాడు.

ఇంటి సభ్యులు వారి గొడవల్లో వారు ఉంటే గీతూ తెలివిగా బొమ్మలను దొంగతనం చేయడం ప్రారంభించింది. ఇది చూసిన శ్రీ సత్య.. నువ్వెలా దొంగతనం చేస్తావ్.. రూల్స్ బ్రేక్ చేసినట్లే అని గీతూపై ఫైర్ అయింది. నేను తగ్గేదేలా అనే తీరులో.. నేను దొంగతనం చేయకూడదని రూల్స్ బుక్‌లో చూపించండి అంటూ ఎదురుప్రశ్నించింది. ఇందుకు శ్రీ సత్య బిగ్‌బాస్ ఆమె మీరు ఆమె ఒక్కదాంతోనే ఆడుకోండి. ఆమె అడ్డంగా గేమ్ ఆడుతుంటే ఒక్క మాట కూడా అనడం లేదు. అంటూ బిగ్‌బాస్‌పైనే ఫైర్ అయింది. అంతేకాకుండా చప్పట్లు కొడుతూ వెటకారం ప్రదర్శించింది.

టాపిక్