Avatar 2 OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అవ‌తార్ 2 - స్ట్రీమింగ్ డేట్ ఇదే-avatar the way of water ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Avatar The Way Of Water Ott Release Date Locked

Avatar 2 OTT Release Date: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న అవ‌తార్ 2 - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 10, 2023 09:00 AM IST

Avatar 2 OTT Release Date: జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్
అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్

Avatar 2 OTT Release Date: జేమ్స్ కామెరూన్ సిల్వ‌ర్ స్క్రీన్ వండ‌ర్ అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్(Avatar The Way of Water) ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడ‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. మార్చి 28 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime), ఆపిల్ టీవీతో పాటు వుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఉచితంగా కాకుండా రెంట‌ల్ విధానంలో 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ త‌ర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిసింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 16న రిలీజైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2.24 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూడో సినిమాగా నిలిచింది.

అవ‌తార్ 2 క‌థ ఏమిటంటే…

జాక్, నెట్రి త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి సంతోషంగా పండోరా గ్ర‌హంపై జీవిస్తోన్న స‌మ‌యంలో వారిపై స్కై పీపుల్‌తో క‌లిసి క్వారిచ్ మ‌రోసారి దాడిచేస్తాడు. క్వారిచ్ బృందం బారి నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి జాక్ రీఫ్ ఐలాండ్‌కు వెళ‌తాడు.

జాక్ ఆచూకీ తెలుసుకొన్న క్వారిచ్ వారికి ఎలాంటి ఆప‌ద‌ను త‌ల‌పెట్టాడు? అత‌డిని జాక్‌, నెట్రి క‌లిసి ఎలా ఎదుర్కొన్నార‌నే క‌థ‌ను మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా అవ‌తార్ సినిమాను తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్‌.

రీఫ్ ఐలాండ్ సీన్స్‌, అండ‌ర్ వాట‌ర్ పోరాట నేప‌థ్య స‌న్నివేశాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్‌కు కొన‌సాగింపుగా అవ‌తార్ 3ని తెర‌కెక్కించ‌బోతున్నారు జేమ్స్ కామెరూన్‌. మూడో భాగాన్ని 2024 డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు.

IPL_Entry_Point