Avatar 2 Free OTT Streaming: అవ‌తార్ -2 ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే-avatar 2 movie free streaming on disney plus hotstar on this date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Avatar 2 Movie Free Streaming On Disney Plus Hotstar On This Date

Avatar 2 Free OTT Streaming: అవ‌తార్ -2 ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే

HT Telugu Desk HT Telugu
May 16, 2023 07:13 AM IST

Avatar 2 Free OTT Streaming: జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ -2 ఎలాంటి రెంట్ లేకుండా ఫ్రీగా ఓటీటీలొ చూడాల‌ని అనుకుంటోన్న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించింది సినిమా యూనిట్‌. ఫ్రీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది.

అవ‌తార్ -2
అవ‌తార్ -2

Avatar 2 Free OTT Streaming: జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ మూవీ ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స‌యింది. జూన్7 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌తో పాటు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి రానుంది. గ‌త మార్చిలోనే అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్ ఓటీటీలో రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

రెంట‌ల్‌ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీతో పాటు ప‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుద‌ల‌చేశారు. తాజాగా జూన్ 7 నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ఫ్యాన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో థియేట‌ర్స్‌లో రిలీజైన ఈ మూవీ 2.9 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. హాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా నిలిచింది.

ఇండియాలోనూ ఐదు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్‌పైగా రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అవ‌తార్‌-2 సినిమాలో రీఫ్ ఐలాండ్ నేప‌థ్యంలో సాగే విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకొన్నాయి. పండోరా గ్ర‌హంపై త‌న భార్యాపిల్ల‌ల‌తో సంతోషంగా ఉన్న జేక్‌పై క‌ల్న‌ల్ క్వారిచ్ బృందం మ‌రోసారి దాడి చేస్తోంది. వారి దాడుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి జేక్ రీఫ్ ఐలాండ్‌కు వెళ‌తాడు.

క్వారిచ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి జేక్, నేట్రి ఎలాంటి పోరాటం సాగించార‌న్న‌ది గ్రాఫిక్స్ ద్వారా జేమ్స్ కామెరూన్ అద్భుతంగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రించారు. అవ‌తార్ సీరిస్‌కు కొన‌సాగింపుగా అవ‌తార్ -3 రాబోతున్న‌ట్లు జేమ్స్ కామెరూన్ ప్ర‌క‌టించారు. అవ‌తార్ 3 మూవీ 2024లో రిలీజ్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.