Ashu Reddy Mobile Number : అషురెడ్డి మెుబైల్ నెంబర్ లీక్.. వేల సంఖ్యలో ఫోన్ కాల్స్
Ashu Reddy Mobile Number Leak : తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిపై పోలీసులు ఫోకస్ చేశారు. కాంటాక్ట్స్ లో అషురెడ్డి కూడా ఉంది. దీనిపై నటి క్లారిటీ ఇచ్చింది.
టాలీవుడ్(Tollywood)లో డ్రగ్స్ ట్రాఫికింగ్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి(KP Choudhary) డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అతనితో టచ్‌లో ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిలో టాలీవుడ్ నటి అషురెడ్డి(Ashu Reddy) కూడా ఉంది. ఇప్పుడు అషురెడ్డి కొన్ని సమస్యల్లో పడింది. అషురెడ్డి మొబైల్ నంబర్ లీక్ కావడంతో ఆమెకు రోజూ వేలల్లో కాల్స్ వస్తున్నాయి.
చౌదరితో పరిచయం ఉన్నవారి జాబితాలో రఘుతేజ పేరు ప్రముఖంగా ఉంది. ఇంకా శ్వేత, సుశాంత్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, ఠాగూర్ ప్రసాద్, చింతా రాకేష్ తదితరులున్నారు. అషురెడ్డి, సురేఖా వాణి(Surekha Vani), జ్యోతి వంటి ప్రముఖులు చౌదరితో కాల్స్ మాట్లాడినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై అషురెడ్డి మరోసారి మాట్లాడింది. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్‌లో అషురెడ్డి కూడా ఉంది. పోలీసులు విడుదల చేసిన నివేదికలో ఆమె పేరు, ఫోన్ నంబర్ కూడా ఉన్నాయి. ఎలాగోలా అషురెడ్డి ఫోన్ నంబర్ బయటకు లీక్(Ashu Reddy Phone Number Leak) అయింది. దీంతో ఆమెకు వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి.
'డ్రగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పరువు తీస్తున్నారు. కొందరు కావాలనే వార్తలు ప్రచురించారు. వారిపై పరువు నష్టం కేసు పెడతాను. నా ఫోన్ నెంబర్ బయటకు లీక్ చేశారు. దీంతో నాకు సెకనుకు ఒక కాల్ వస్తోంది. ఈ మొబైల్ నంబర్ వాడటం మానేశాను.' అంటూ అషురెడ్డి మొబైల్‌కి వచ్చిన కాల్స్ చూపించింది. అంతకు ముందు కూడా ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా విషయాన్ని చెప్పింది.
'కొందరు మీడియా ప్రతినిధులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తులతో నాకు సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. అదంతా అబద్ధం. అవసరం వచ్చినప్పుడు నేనే విషయాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తాను. నా మొబైల్ నంబర్‌ను వెల్లడించడం సహించబోను.' అని అషురెడ్డి తెలిపింది.
విచారణను ఎదుర్కొంటున్న నిర్మాత కేపీ చౌదరి(KP Choudhary) ఫోన్ కాల్ లిస్టును గమనించగా.. అషురెడ్డి పేరు కూడా ఉంది. సినీ పరిశ్రమలోని పలువురు నటీనటులకు కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన 12 మంది వ్యక్తుల జాబితాను పోలీసులు గుర్తించారు. చౌదరి ఫోన్ కాల్ లిస్ట్‌తో పాటు, వారి బ్యాంకు లావాదేవీలపై కూడా నిఘా ఉంచారు.