pushpa 2: పుష్ప-2 షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన సుకుమార్
పుష్ప 2 (pushpa 2) తో పాన్ ఇండియన్ మార్కెట్ పై దృష్టిపెట్టాడు అల్లు అర్జున్(allu arjun). సుకుమార్ (sukumar)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందంటే...
ఈ ఏడాది అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సీక్వెల్స్ లో పుష్ప-2 ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప తొలి భాగం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తెలుగు, మలయాళంతో పాటు బాలీవుడ్ లో అల్లు అర్జున్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాంతో పుష్ప -2 కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఫైనల్ వెర్షన్ ను రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నారు. ఆగస్ట్ నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప 2లో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నట్లుగా కొన్నాళ్లుగాప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను చిత్ర యూనిట్ ఖండించింది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించడం లేదని పేర్కొన్నది.
పుష్ప ది రైజ్‌లో ఫహాద్ ఫాజిల్ పాత్ర కు నిడివి తక్కువగా ఉంటుంది. రెండో భాగంలో మాత్రం అతడు ఆద్యంతం కనిపిస్తాడని సమచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు
సంబంధిత కథనం
టాపిక్