Samantha Reaction: నాగ చైతన్య మొత్తానికి మరో పెళ్లి చేసుకున్నాడు. శోభితా ధూళిపాళ్ల మెడలో తాళి కట్టాడు. దీనిపై చైతూ మాజీ భార్య సమంత ఏమైనా రియాక్ట్ అవుతుందేమో అని కొందరు ఎదురు చూశారనడంలో సందేహం లేదు. అయితే వీళ్ల పెళ్లి తర్వాత ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. కానీ ఆ పోస్టుతో వీళ్ల పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు.
సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య రెండేళ్ల పాటు శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేసి మొత్తానికి బుధవారం (డిసెంబర్ 4) రాత్రి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అటు సమంత మాత్రం ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అయితే ఇప్పటి వరకూ చైతూ డేటింగ్, పెళ్లిపై ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
వీళ్ల పెళ్లి తర్వాత కూడా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఈ మధ్యే తాను నటించిన సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ చేయడం విశేషం. అంతేకాదు ఫైట్ చేస్తే ఓ అమ్మాయిలాగా చేయాలంటూ మరో చిన్న వీడియోను కూడా స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసింది.
సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ ఉంది. రూసో బ్రదర్స్ చేసిన ఓ పోస్ట్ స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ.. ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే గురించి ఆమె ప్రస్తావించింది.
"అద్భుతమైన ప్రయాణం.. అద్భుతమైన డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేతో సిటడెల్: హనీ బన్నీలో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను" అనే క్యాప్షన్ తో ఈ ఫొటోను షేర్ చేసింది. అంతకుముందు ఫైట్ లైక్ ఎ గర్ల్ అంటూ ఓ చిన్న పాప, బాబుతో రెజ్లింగ్ చేస్తున్న వీడియోను కూడా ఆమె స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అయితే చైతూ, శోభిత పెళ్లి గురించి మాత్రం ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
నాగ చైతన్య, శోభిత పెళ్లి బుధవారం (డిసెంబర్ 4) రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి, సుహాసిని, అడివి శేష్, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, చాముండేశ్వరినాథ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా ఎన్నో బయటకు వచ్చాయి. కొన్ని రోజుల ముందు నుంచే వీళ్ల పెళ్లి తంతు మొదలైంది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటైంది. 2022 నుంచి శోభితతో చైతూ రిలేషన్షిప్ లో ఉన్నాడు.
అక్కినేని కుటుంబంలో త్వరలోనే మరో వివాహం కూడా జరగనుంది. ఇటీవల అక్కినేని అఖిల్ కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే అక్కినేని నాగార్జున జరిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాపిక్