Ajith Birthday: అజిత్ బ‌ర్త్‌డే ట్రీట్ వ‌చ్చేసింది - కొత్త సినిమాకు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్‌-ajith 62 director and title unveiled on his birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Birthday: అజిత్ బ‌ర్త్‌డే ట్రీట్ వ‌చ్చేసింది - కొత్త సినిమాకు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్‌

Ajith Birthday: అజిత్ బ‌ర్త్‌డే ట్రీట్ వ‌చ్చేసింది - కొత్త సినిమాకు సెంటిమెంట్ టైటిల్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
May 01, 2023 07:08 AM IST

Ajith Birthday: అజిత్ బ‌ర్త్‌డే కానుక‌గా అత‌డి 62వ సినిమా టైటిల్‌తో పాటు ద‌ర్శ‌కుడిని అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏదంటే..

అజిత్‌, అనిరుధ్‌, మ‌గిజ్ తిరుమోని
అజిత్‌, అనిరుధ్‌, మ‌గిజ్ తిరుమోని

Ajith Birthday: అజిత్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సోమ‌వారం అత‌డి 62వ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు డైరెక్ట‌ర్‌ను రివీల్ చేశారు. అజిత్(Ajith Birthday) కొత్త సినిమాకు విదా ముయార్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఎఫ‌ర్ట్స్ నెవ‌ర్ ఫెయిల్ అనే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది.

ఈ సినిమాకు మ‌గిజ్ తిరుమోని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. గ‌తంలో క‌ళ‌గ‌త‌ళైవాన్‌, తాడ‌మ్‌తో పాటు త‌మిళంలో మ‌రో మూడు సినిమాలు చేశాడు తిరుమోని. అగ్ర హీరోతో అత‌డు చేయ‌బోతున్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

సెంటిమెంట్ లెట‌ర్‌తో...

కాగా మ‌రోసారి వీ లెట‌ర్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఈ సినిమాకు విదా మ‌యూర్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. వీ లెట‌ర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఇటీవ‌ల కాలంలో అజిత్ చేసిన‌సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హిట్స్‌గా నిలిచాయి. వివేగం, విశ్వాసం, వ‌లిమై, వేదాళం అన్ని సినిమాలు వంద‌ల కోట్ల‌కుగాపై వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి.

అందుకే టైటిల్ విష‌యంలో వీ లెట‌ర్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతూ చిత్ర యూనిట్ ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఓ సామాజిక స‌మ‌స్య‌కు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడిస్తూ విదా మ‌యూర్చి మూవీ రూపొందుతోన్న‌ట్లు తెలిసింది. మే నెలాఖ‌రున ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. తొలుత ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా విఘ్నేష్ శివ‌న్‌ను అనౌన్స్‌చేశారు. కానీ విఘ్నేష్ చెప్పిన క‌థ అజిత్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ మెటిరియ‌లైజ్ కాలేదు. విఘ్నేష్ స్థానంలో తిరుమోనిని ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ చేశారు.

IPL_Entry_Point

టాపిక్