Adipurush Budget | ప్రభాస్‌ ఆదిపురుష్‌ బడ్జెట్‌ ఎంతో తెలిసిపోయింది!-adipurush movie budget revealed by the producer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adipurush Budget | ప్రభాస్‌ ఆదిపురుష్‌ బడ్జెట్‌ ఎంతో తెలిసిపోయింది!

Adipurush Budget | ప్రభాస్‌ ఆదిపురుష్‌ బడ్జెట్‌ ఎంతో తెలిసిపోయింది!

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 07:47 PM IST

టాలీవుడ్‌ యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మచ్‌ అవేటెడ్‌ మూవీ ఆదిపురుష్‌. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.

<p>ఆదిపురుష్ మూవీ పోస్టర్</p>
ఆదిపురుష్ మూవీ పోస్టర్ (Twitter)

బాహుబలి మూవీ ప్రభాస్‌ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. అప్పటి వరకూ కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన అతడు.. ఈ మూవీ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత వస్తున్న అతని సినిమాలన్నీ పాన్‌ ఇండియా సినిమాలే అవుతున్నాయి. అవి కూడా ఒకదానికి మించి మరొకటి భారీ బడ్జెట్‌తో వస్తున్నాయి. ఇప్పటికే సాహో, రాధేశ్యామ్‌ అయిపోయాయి.

yearly horoscope entry point

ఇక సలార్‌, ఆదిపురుష్‌లాంటి మూవీలు లైన్‌లో ఉన్నాయి. వీటిలో కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సలార్‌ ఆసక్తి రేపుతుంటే.. ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమా కోసం అతని ఫ్యాన్స్‌ అంతకంటే ఎక్కువ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ ఎంతో కూడా తెలిసిపోయింది. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇది అతి భారీ బడ్జెట్ మూవీ కానుంది.

ఈ మూవీ బడ్జెట్‌ రూ.500 కోట్లు అని నిర్మాత భూషణ్‌ కుమార్‌ వెల్లడించినట్లు పింక్‌విల్లా చెప్పింది. ఓంరౌత్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ కోసం ప్రభాసే రూ.100 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుండటం విశేషం. ఈ రూ.500 కోట్ల బడ్జెట్‌కు పబ్లిసిటీ కోసం చేసే ఖర్చు అదనం. "ఆదిపురుష్‌ను రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నాం. ఈ మూవీకి హౌజ్‌ఫుల్ బోర్డులతో ఓపెనింగ్స్‌ అదిరిపోతాయని మాకు తెలుసు. అందుకే టికెట్ల ధరలు కూడా భారీగా పెంచాలని నిర్ణయించాం. టికెట్ల ధరతో సంబంధం లేకుండా ఇలాంటి మూవీ చూడటానికి ప్రేక్షకులు వస్తారు" అని ప్రొడ్యూసర్‌ భూషణ్‌ కుమార్‌ చెప్పడం విశేషం.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ సింగ్‌ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానున్న ఈ మూవీ ప్రమోషన్లు అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం