Telangana Congress Manifesto : 62 అంశాలతో కాంగ్రెస్ 'అభయ హస్తం' మేనిఫెస్టో విడుదల - కీలక హామీలివే-congress released party manifestos for telangana assembly elections 2023 check highlights are here ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana Congress Manifesto : 62 అంశాలతో కాంగ్రెస్ 'అభయ హస్తం' మేనిఫెస్టో విడుదల - కీలక హామీలివే

Telangana Congress Manifesto : 62 అంశాలతో కాంగ్రెస్ 'అభయ హస్తం' మేనిఫెస్టో విడుదల - కీలక హామీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 17, 2023 01:21 PM IST

Telangana Congress Manifesto 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… తమ మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో 62 ప్రధాన హామీలను పేర్కొంది.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Telangana Congress Manifesto 2023: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే... అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో… 62 ప్రధాన అంశాలతో అభయహస్తం మేనిఫెస్టో రూపొందించింది కాంగ్రెస్. ఇందులో ధరణితో పాటు విద్యార్థులు, డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనతో పాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిందన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టోను రూపొందించామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలను ఇందులో పొందుపరిచామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ… దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. పేదలకు భూములపై హక్కులు కల్పించేలా పలు అంశాలను పేర్కొన్నారు తెలిపారు.ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ నేతలు,కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అభయ హస్తం మేనిఫెస్టోలోని కీలక హామీలు :

  • నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రజాదర్బార్ లు
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుంది.
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్. కొత్త రెవెన్యూ వ్యవస్థ. రైతు కమిషన్ ఏర్పాటు
  • అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ. 25 వేల పెన్షన్
  • వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్.
  • ఆరు నెలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ.
  • రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఐఐఐటీలు ఏర్పాటు
  • సీపీఎస్ రద్దు… ఓపీఎస్ అమలు
  • ఆటో డ్రైవర్ కు ఏడాది రూ. 12 వేలు
  • రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ
  • జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల అమలు. బీసీ జనాభా గణన
  • రాష్ట్రంలో బెల్టు షాపులు రద్దు.
  • రూ. 3 లక్షల వడ్డీ లేని పంట రుణాలు.
  • ప్రధాన పంటలకు బీమా పథకం
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • బీడీ కార్మికులకు చేయూత కింద పెన్షన్లు.
  • న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5వేల గౌరవ భృతి.
  • అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.
  • జానపద కళాకారులకు పెన్షన్లు.
  • హైదరాబాద్ విజన్ - 2023 పేరుతో అభివృద్ధి
  • అధికారంలోకి రాగానే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
  • కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై విచారణ
  • విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం.
  • ప్రతి ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు.

Whats_app_banner