Jagan Advisors: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఐదేళ్లు ఎవరు సలహాలిచ్చారు...? కళ్లు, చెవులుగా పనిచేసిందెవరు?-who advised chief minister jaganmohan reddy for five years ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jagan Advisors: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఐదేళ్లు ఎవరు సలహాలిచ్చారు...? కళ్లు, చెవులుగా పనిచేసిందెవరు?

Jagan Advisors: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి ఐదేళ్లు ఎవరు సలహాలిచ్చారు...? కళ్లు, చెవులుగా పనిచేసిందెవరు?

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 12:45 PM IST

Jagan Advisors: సలహాలివ్వండి, సంస్కరణలు తీసుకొస్తానని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లు సిఎంకు సలహాలిచ్చిన వారు ఎవరనే చర్చ జరుగుతోంది.

ఏపీ సిఎం జగన్‌కు ఐదేళ్లు సలహాలు ఇచ్చింది ఎవరు..?
ఏపీ సిఎం జగన్‌కు ఐదేళ్లు సలహాలు ఇచ్చింది ఎవరు..?

Jagan Advisors: ప్రజలు స్వచ్ఛంధంగా సలహాలు, సూచనలిస్తే పాలనలో సంస్కరణలు తీసుకొస్తానని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి Ys Jagan ఎర్రగుంట్లలో చేసిన ప్రకటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వర్గాలతో పాటు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.

YCP అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలతో పరిపాలన చేశారనే ప్రశ్న ప్రధానంగా బ్యూరోక్రాట్ల నుంచి ఎదురవుతోంది. ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్‌ సమావేశాలకు మాత్రమే సచివావాలయానికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఐదేళ్లు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే పాలన మొత్తం సాగించిన... జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో సలహాలిచ్చే అవకాశం ఎంత మందికి ఇచ్చారనే ప్రశ్న లేవనెత్తుతున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే Tadepalli తాడేపల్లిలోని నివాసంలో కూడా సెక్రటేరియట్‌‌లో ఉన్న థీమ్‌తో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పాలన సాగించారు. దీంతో చాలా కాలం పాటు సిఎం జగన్ సచివాలయంలోనే ఉంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులు కూడా భావించారు. ఆయన ఇంట్లోనే క్యాంపు కార్యాలయం నుంచి పాలన సాగిస్తున్నారనే సంగతి ప్రభుత్వ అధికారులకు తెలియడానికి చాలా కాలం పట్టింది.

ఐదేళ్లు కోటరీ కనుసన్నల్లోనే…

తాడేపల్లిలో ముఖ్యమంత్రిని ఓ కోటరీ కమ్మేసిందనే అపప్రద మొదటి నుంచి ఉంది. అధికారులు, సలహాదారులు, వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులతో ఏర్పడిన కోటరీలోకి ఇతరుల్ని దగ్గరకు రాకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో సీనియర్ ఐఏఎస్‌ అధికారులకు సైతం ముఖ్యమంత్రితో నేరుగా ఆలోచనలు పంచుకునే అవకాశం లేకుండా పోయిందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గంతో పాటు బ్యూరో క్రాట్లలో మరో ప్రధాన వర్గం సిఎంను తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడంలో సక్సెస్ అయ్యింది.

విధాన పరమైన నిర్ణయాల విషయంలో ముఖ్యమంత్రి ఎవరి సలహాలు తీసుకోడానికి ఇష్టపడరని కూడా సీనియర్ ఐఏఎస్‌లు గుర్తు చేస్తున్నారు.పేదలందరికి ఇళ్లు జగనన్న కాలనీల నిర్మాణంలో భాగంగా లబ్దిదారులకు కనీసం రెండు సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని ఐఏఎస్‌లు ప్రతిపాదించినపుడు జగన్ నిర్ద్వందంగా తోసి పుచ్చినట్టు ఓ ఐఏఎస్‌ అధికారి గుర్తు చేసుకున్నారు. తాము చెప్పేది కూడా వినడానికి కూడా సిఎం ఇష్టపడలేదని గుర్తు చేసుకున్నారు.

ఇక ప్రభుత్వం వచ్చిన వెంటనే విధానపరమైన అంశాలపై సలహాదారుడిగా నియమితుడైన వ్యక్తి .. రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగినా.. తనకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని ముఖాముఖి కలిసి సలహా ఇచ్చే అవకాశం రాలేదని ఆ పదవికి రాజీనామా చేశారు. మంచిచెడుల గురించి చర్చించే అవకాశం రాకపోవడంతోనే పదవి నుంచి తప్పుకున్నారు.

సన్నిహితులకు కూడా నో ఛాన్స్‌..

ముఖ్యమంత్రి బాగా దగ్గరి మనుషులు, అధికారంలోకి రాకముందు ఆయనతో కలిసి పనిచేసిన వారికి కూడా పదవిలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయనతో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం రాలేదని గుర్తు చేస్తున్నారు. పదేళ్లు ప్రజల్లో కలిసి మెలిసి తిరుగుతూ, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ పాదయాత్రలు చేసిన వ్యక్తిని, అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు ఎవరిని దగ్గరకు రానివ్వకపోవడమే అసలు సమస్య అని గుర్తు చేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తానని ప్రకటించడమంటే ఇన్నాళ్లు తాను ఎవరి సలహా పాటించలేదని అంగీకరించడమే కదా అనే ప్రశ్నిస్తున్నారు.

ఐదేళ్లలో ముఖ్యమంత్రికి నేరుగా సలహాలు ఇచ్చిన వారిలో TrumpAvinash ట్రంప్ అవినాష్‌, పొలిటికల్ కన్సల్టెన్సీ ‎ఐ పాక్‌కు చెందిన RishiRaj రిషిరాజ్‌ మాత్రమే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వ్యవహారాలు, వ్యూహ రచనపై వారిపై ఆధారపడటంతో ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం వారికి దక్కింది. సర్వేలు, పార్టీ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో నివేదికల్ని ముఖ్యమంత్రికి చేరవేయడం, మీడియా వ్యవహారాలను చక్కబెట్టడం వంటి వ్యవహారాల్లో వారు కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు.

అంతా కొందరి చేతుల్లోనే….

పాలనా వ్యవహారాలు, విధానపరమైన నిర్ణయాలు, రాజకీయాల విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఓఎస్డీలు, ఒకరిద్దరు ఐఏఎస్‌ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు,నిఘా విభాగం అధికారుల మాటల మీదే ఐదేళ్లు పూర్తిగా ఆధార పడిపోయినట్టు గుర్తు చేస్తున్నారు.

పార్టీ పరిస్థితులు, నియోజక వర్గాల సమస్యలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, జిల్లాల్లో రాజకీయాలు, అంతర్గత విభేదాలు ఇలాంటి ఏ సమస్యలైనా ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా చెప్పుకునే అవకాశం ఏ స్థాయి నాయకులకు దక్కలేదు. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనా వారిలో ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టుకునే అవకాశం కొద్దిమందికి మాత్రమే దక్కింది.

ఎమ్మెల్యేలు కూడా సజ్జల, సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారిని ఆశ్రయించడమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఐఏ‎ఎస్‌ అధికారులకు ఏకరువు పెట్టుకోవడమో తప్ప నేరుగా చర్చించే పరిస్థితులు లేవని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి ముందు వైసీపీతో సంబంధం లేని వ్యక్తులు కూడా పదవిలోకి రాగానే దగ్గరై ఎవరిని దగ్గరకు రాకుండా చేశారనే అక్రోశం వైసీపీ నాయకుల్లో ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం