AP TS Elections Live News Updates: ఏపీలో పోటెత్తిన ఓటర్లు- రాత్రి 10 గంటల వరకూ పోలింగ్-andhra pradesh and telangana general elections polling live news updates 2024 ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Ts Elections Live News Updates: ఏపీలో పోటెత్తిన ఓటర్లు- రాత్రి 10 గంటల వరకూ పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్

AP TS Elections Live News Updates: ఏపీలో పోటెత్తిన ఓటర్లు- రాత్రి 10 గంటల వరకూ పోలింగ్

04:37 PM ISTMay 13, 2024 09:22 PM Sarath chandra.B
  • Share on Facebook
04:37 PM IST

  • AP TS Elections Live News Updates: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  కొన్ని ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ పూర్తి అవ్వగా… మిగతా చోట్ల 6 గంటలకు పూర్తి అయింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…

Mon, 13 May 202403:52 PM IST

పల్నాడులో బాంబులతో దాడులు

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తంగెడలో వైసీపీ, టీడీపీ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్‌ సీసాలతో దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ ముగిసే సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఓటింగ్‌ శాతం పెరిగితే తమకు నష్టమేమోనని వైసీపీ మూకలు నాటు బాంబులతో దాడులకు దిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకోవడంతో ఓటర్లు భయాందోళనకు గురై పోలింగ్‌ కేంద్రం నుంచి పరుగులు తీశారు. ఓటింగ్‌ శాతం తగ్గించేందుకే వైసీపీ ఇలాంటి దాడులకు పాల్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో సుమారు 10 బైక్ లు, నాలుగు షాపులు మంటల్లో దగ్ధమయ్యాయి.

Mon, 13 May 202403:52 PM IST

రాత్రి 10 గంటలవ రకూ పోలింగ్ 

ఏపీలో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగే అవకాశం ఉందని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. సాయంత్రం 6 తర్వాత క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. 

Mon, 13 May 202403:31 PM IST

ఏపీలో ఓటర్ చైతన్యం, రాత్రి 9 గంటల వరకూ క్యూలైన్లు 

ఏపీలో ఎన్నడూ చూడని దృశ్యాలు పోలింగ్ బూత్ వద్ద కనిపించాయి. జన చైత్యనంతో పోలింగ్ బూత్ ల ముందు భారీగా క్యూలైన్లు దర్శనమిచ్చాయి. దీంతో గత పోలింగ్ శాతాన్ని మించి నమోదు అవుతుందని అధికారులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకూ పోలింగ్ సాగింది. క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. 

Mon, 13 May 202412:53 PM IST

ముగిసిన పోలింగ్ టైమ్

తెలుగు రాష్ట్రాల్లో  పోలింగ్‌ ముగిసింది.  6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ చాలా పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు ఉన్నాయి.

Mon, 13 May 202412:31 PM IST

భువనగిరిలో అత్యధికం…..

భువనగిరి - 72.34%

జహీరాబాద్ - 71.91%

మెదక్  - 71.33%

Mon, 13 May 202412:30 PM IST

హైదరాబాద్ లో తక్కువ పోలింగ్ శాతం…

హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటల వరకు చూస్తే హైదరాబాద్ లో  39.17% నమోదైంది.

సికింద్రాబాద్ - 42.48%

మల్కాజ్ గిరి - 46.25%

 

Mon, 13 May 202412:27 PM IST

ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదు….

ఏపీ వ్యాప్తంగా  భారీగా పోలింగ్ నమోదవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది.

Mon, 13 May 202412:27 PM IST

పోలింగ్ కేంద్రాల్లో భారీగా జనం

ఏపీ తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Mon, 13 May 202412:10 PM IST

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్‌…

ఆదిలాబాద్ -69.81 శాతం, 

భువనగిరి -62.34 శాతం, 

చేవెళ్ల -53.15 శాతం, 

హైదరాబాద్‌-39.17 శాతం, 

కరీంనగర్-67.67 శాతం, 

ఖమ్మం-70.76 శాతం, 

మహబూబాబాద్-68.60 శాతం, 

మహబూబ్‌నగర్-68.40 శాతం, 

మల్కాజిగిరి-46.27 శాతం, 

మెదక్-71.33 శాతం, 

నాగర్ కర్నూల్ -66.53 శాతం, 

నల్గొండ-70.36 శాతం, 

నిజామాబాద్-67.96 శాతం, 

పెద్దపల్లి-63.86 శాతం, 

సికింద్రాబాద్‌ -42.48 శాతం, 

వరంగల్-64.08 శాతం, 

జహీరాబాద్-71.91 శాతం నమోదు

సికింద్రబాద్ కంటోన్మెంట్ లో 47.88 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది.

Mon, 13 May 202412:04 PM IST

చంద్రబాబు ట్వీట్… ఏమన్నారంటే..?

“రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు సాయంత్రం 5 కావస్తుంది....ఉదయం 7 గంటలకు ఎంత పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో ఉన్నారో....పోలింగ్ ముగిసే ఈ సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ప్రజలు ఓటింగ్ పై ఇంత ఉత్సాహం చూపడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం” అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.

Mon, 13 May 202411:57 AM IST

హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం…

హనుమకొండ జిల్లాలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు :

పరకాల : 70.2%

వరంగల్ పశ్చిమ: 47%

ఇప్పటివరకు జిల్లాలో మొత్తం పోలింగ్ శాతం 57.2%

Mon, 13 May 202411:50 AM IST

ఈసీకి బీజేపీ ఫిర్యాదు,,,,,

ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి ప్రెస్ మీట్ పెట్టి మరి బిజెపిపై, ప్రధాని మోదీపై కేంద్ర దర్యాప్తు సంస్థలపై తప్పుడు ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలంగాణ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

 

Mon, 13 May 202411:42 AM IST

ఈసీ సీరియస్…..

రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో పాటు కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు.

Mon, 13 May 202411:59 AM IST

ఈ ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ …..

తెలంగాణలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్ కొనసాగనుంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ముగిసింది.

Mon, 13 May 202411:34 AM IST

జోరుగా పోలింగ్..

కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో జోరుగా పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 56.34% పోలింగ్ నమోదైంది.

Mon, 13 May 202411:33 AM IST

ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం(మధ్యాహ్నం 3 గంటలకు….)

ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ శాతం ( 3 PM )

తిరువూరు -59.02 శాతం

విజ‌య‌వాడ ప‌శ్చిమ -51.30 శాతం

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ -50.33 శాతం

విజ‌య‌వాడ తూర్పు -55.38 శాతం

మైల‌వ‌రం -55.00 శాతం

నందిగామ -59.15 శాతం

జ‌గ్గ‌య్య‌పేట -63.10 శాతం

జిల్లా మొత్తం మీద పోలింగ్ శాతం: 55.71 శాతం

Mon, 13 May 202411:30 AM IST

52.30 శాతం పోలింగ్…

మధ్యాహ్నం 3   గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైంది.

Mon, 13 May 202410:26 AM IST

ఏపీలో 55.49 శాతం, తెలంగాణలో 52.34 శాతం పోలింగ్

ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు. తెలంగాణలో 52.34 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపింది.

చిత్తూరు - 61.43 శాతం,

విశాఖపట్నం - 47.66 శాతం

జహీరాబాద్‌- 63.96 శాతం

హైదరాబాద్‌ - 29.47 శాతం

Mon, 13 May 202410:21 AM IST

ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్

ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు.

Mon, 13 May 202410:08 AM IST

తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ను అదుపులోకి తీసుకోండి- ఈసీ

తెనాలి ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఆయనను హౌస్ అరెస్టులో ఉంచాలని పేర్కొంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ పై చేయి చేసుకున్న ఘటనపై ఈసీ ఈ చర్యలు తీసుకుంది. తెనాలిలో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్ పై వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ దాడి చేశారు.

Mon, 13 May 202409:51 AM IST

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ స్టేషన్‌లోకి చొరబడి కొంతమంది ముస్లిం మహిళా ఓటర్లను బురఖా తొలగించి వారి గుర్తింపును వెల్లడించాలని కోరినందుకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Mon, 13 May 202409:39 AM IST

తెలంగాణలో ఇప్పటి వరకూ 40.38 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 01.30 గంటల వరకు తెలంగాణలో ఓటింగ్ శాతం జహీరాబాద్‌లో అత్యధికంగా 50.71%, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్పంగా 19.37% నమోదైంది. ఇక రాష్ట్రం వ్యాప్తంగా 40.38% నమోదైంది.

Mon, 13 May 202409:23 AM IST

పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ కుట్ర- చంద్రబాబు

పోలింగ్ లో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన వాళ్లు, తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలని చంద్రబాబు కోరారు.

Mon, 13 May 202409:07 AM IST

ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం

ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26 శాతం పోలింగ్‌ నమోదు కాగా, తెలంగాణలో 1 గంట వరకు 40.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

అల్లూరి జిల్లా – 32.80 శాతం

అనకాపల్లి – 37 శాతం

అనంతపురం – 39.82 శాతం

అన్నమయ్య – 39.60 శాతం

విశాఖపట్నం – 33.72 శాతం

విజయనగరం – 40.30 శాతం

బాపట్ల – 44.45 శాతం

చిత్తూరు – 44.50 శాతం

కోనసీమ – 44.03 శాతం

తూర్పుగోదావరి జిల్లా – 38.54 శాతం

ఏలూరు – 38.76 శాతం

గుంటూరు – 40.12 శాతం

కాకినాడ – 38.25 శాతం

కృష్ణా – 44.50 శాతం

కర్నూలు – 38 శాతం

నంద్యాల – 44.20 శాతం

ఎన్టీఆర్ జిల్లా – 39.60 శాతం

పల్నాడు – 40.53 శాతం

పార్వతీపురం మన్యం – 34.87 శాతం

ప్రకాశం – 42.78 శాతం

నెల్లూరు – 42.38 శాతం

సత్యసాయి జిల్లా – 38.10 శాతం

శ్రీకాకుళం – 40.56 శాతం

తిరుపతి – 39.14 శాతం

పశ్చిమగోదావరి జిల్లా – 39.50 శాతం

కడప – 45.56 శాతం

 

Mon, 13 May 202409:03 AM IST

ఓటర్ పై దాడి ఘటనపై అన్నాబత్తుని వివరణ

గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటర్ పై దాడికి చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ స్పందించారు. తెనాలి ఐతాన‌గ‌ర్‌లో తన భార్యతో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లామన్నారు. ఈ సమయంలో గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి...తనను దుర్భాషలాడడన్నారు. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాక‌ర్ తనపై దుర్భాష‌లాడాడని అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ ఆరోపించారు. వైసీపీపై చాలా ద్వేషంతో అతడు ర‌గిలిపోయాడన్నారు. చాలా శాడిజంగా మాట్లాడాడన్నారు.

Mon, 13 May 202408:36 AM IST

ఏపీలో మధ్యాహ్నం 1 గంటకు 40.26 శాతం పోలింగ్ 

ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర వ్యాప్తంగా 40.26 శాతం పోలింగ్ నమోదైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. 

Mon, 13 May 202408:33 AM IST

తాడిపత్రిలో పరిస్థితి అదుపులోనే ఉందన్న కలెక్టర్…

అనంతపురము జిల్లాలోని 2236 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌  ప్రశాంతంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మద్యాహ్నం 1 గంటకు జిల్లాలో 39.45 శాతం పోలింగ్ నమోదైందని,  తాడిపత్రి నియోజకవర్గంలో స్వయంగా పర్యటించి శాంతి భద్రతలను పర్యవేక్షించాలని ఎస్పీ అమిత్ బర్దార్ తో సమన్వయం చేసుకున్నట్టు చెప్పారు.

ఎస్పీ తాడిపత్రి కి సకాలంలో చేరుకుని శాంతి భద్రతలను స్వయానా పర్యవేక్షిస్తున్నారని,  పోలింగ్ కు ఎటువంటి అంతరాయం కలగలేదని,  తాడిపత్రిలో మధ్యాహ్నం 1 గంటకు 40.01 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. 

కలెక్టరేట్లో జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతిక్షణం పోలింగ్ కేంద్రాలపై గట్టి నిఘా పెట్టామన్నారు. పోలింగ్ కు ఎక్కడా ..ఎటువంటి ఇబ్బంది లేదని . ఓటు వేయని ఓటర్లు సాయంత్రం 6 లోపు వారి వారి పోలింగ్ కేంద్రానికి వెళ్లి  ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. 

Mon, 13 May 202408:30 AM IST

మాచర్లలో నిలిచిన పోలింగ్

మాచర్లలో  ఈవీఎంలను దుండగులు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది.  మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్‌ నిలిచిపోయింది.  దీంతో  పోలింగ్ నిలిపేసి భయంతో సిబ్బంది బయటకు వెళ్లిపోయారు. మాచర్ల పరిణామాలపై  ఎన్నికల సిబ్బంది కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు.

Mon, 13 May 202408:27 AM IST

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

పోలింగ్ కేంద్రాల్లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించారనే అభియోగాలపై బీజేపీ లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశారు. 

Mon, 13 May 202408:26 AM IST

నాందేడ్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ 9గంటల ఆలస్యం, రైల్లో వెయ్యిమంది ఓటర్లు

నాందేడ్‌-విశాఖపట్నం  సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ 9 గంటల ఆలస్యంగా నడుస్తోంది. ఈ  రైల్లో వెయ్యి మంది ప్రయాణికులు ఓటు వేసేందుకు సికింద్రాబాద్‌  నుంచి బయలు దేరారు. ఉదయం ఐదున్నరకు సికింద్రాబాద్‌ వచ్చిన రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో  ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు రైలు బుక్‌ చేసుకున్న వారు సాయంత్రం ఆరులోగా విశాఖ చేరుకోలేమని వాపోతున్నారు. రైలు క్యాన్సిల్ చేస్తే ప్రత్యామ్నయం చూసుకునే వారిమని, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓటు వేసే అవకాశం కోల్పోతున్నామని చెబుతున్నారు. 

Mon, 13 May 202408:16 AM IST

అంబటి అల్లుడి కారుపై  దాడి

పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగు పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు.

Mon, 13 May 202408:14 AM IST

తాడిపత్రిలో పెద్దారెడ్డి అరెస్ట్

తాడిపత్రి టౌన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఇరు వర్గాల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన  పోలీసుల వాహనాలపై వైసీపీ నేతలు  రాళ్లతో  దాడి చేశారు.  వైసీపీ నేతల రాళ్ల దాడిలో ఎస్పీ వాహనం ధ్వంసమయ్యాయి.  తాడిపత్రి టీడీపీ అభ్యర్ధి అస్మిత్ రెడ్డి, జేసీ కార్లు ధ్వంసం అయ్యాయి.  తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్ చేశారు. 

Mon, 13 May 202408:08 AM IST

40శాతం దాటిన పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపు 40.26 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు కోటిన్నర మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణాలు, పల్లెల్లో ఓటర్లు బారులు తీరారు. గత ఎన్నికల భిన్నంగా పెద్ద ఎత్తున  ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారుర. 

Mon, 13 May 202408:00 AM IST

ఐపీఎస్‌లపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్‍ల పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది.  టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు  చేశారు. డీజీపీలు  ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్ మంగళగిరి టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారని,  మంగళగిరి టీడీపీ ఆఫీస్‍ లో కూర్చొని జిల్లాల పోలీస్ అధికారులకు ఫోన్లు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

Mon, 13 May 202407:48 AM IST

ఏపీలో 36శాతం పోలింగ్ నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ చురుగ్గా కొనసాగుతోంది.  మధ్యాహ్నం 12 గంటలకు  40శాతం పోలింగ్‌ నమోదైంది. తెలంగాణలో 32శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో ఎండల్ని లెక్క చేయకుండా ఓటర్లు బారులు  తీరారు. 

Mon, 13 May 202407:19 AM IST

మాచర్లలో టీడీపీ అభ్యర్థి వాహనంపై దాడి

మాచర్ల నియోజకవర్గం రెంటాలలో టీడీపీ అభ్యర్థి వాహనంపై దాడి జరిగింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై  వైసీపీ మూకలు రాళ్లు విసిరారు. రెంటాలలో పోలింగ్ సరళిని చూసేందుకు వెళ్లిన జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు.  మాచర్ల నియోజకవర్గం రెంటాలలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణతో భారీగా పోలీసులు మొహరించారు. 

Mon, 13 May 202407:18 AM IST

షేక్‌పేటలో ఓట్ల గల్లంతు కిషన్ రెడ్డి ఆగ్రహం

షేక్ పెట్ లో ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.  తమ ఓట్లు గల్లంతు కావడంతో  ఓటర్లు ఆందోళనకు దిగారు. షేక్ పేట్ డివిజన్ లో దాదాపు 3వేల ఓట్లను డిలీట్ చేశారని,  గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారని, . ఇప్పుడేమో డిలీట్ అయ్యాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారని,  కేవలం ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారని,   వారం కిందట ఓటర్ స్లిప్లను పంచిన వారికి కూడా  ఇప్పుడు లిస్ట్ లో ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయని,  అధికారులు కావాలనే ఓట్లను డిలీట్ చేశారు.. దీనిపై పోరాడుతామన్నారు.  ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ వ్యవహారంపై . దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.   కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. 

Mon, 13 May 202407:07 AM IST

పల్నాడులో హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన

పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.  మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనన్న టీడీపీ అధ్యక్షుడు ఆరోపించారు.  పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలం  అయ్యారని ఆరోపించారు.  ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా,  పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా శాంతిభద్రతలు కాపాడలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు. ఈసీ వెంటనే పోలింగ్‍ ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. 

Mon, 13 May 202406:14 AM IST

ఓటరుపై ఎమ్మెల్యే దాడి

గుంటూరు జిల్లా తెనాలిలో అనూహ్య ఘటన చోటుే చేసుకుంది. ఓటర్‍ పై  వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేశారు.  క్యూలైన్‍లో కాకుండా నేరుగా వైసీపీ అభ్యర్థి వెళ్లడంపై ఓటరు అభ్యంతరం  తెలిపాడు. ఆగ్రహంతో ఓటరుపై దాడి చేశాడు.  ఓటర్ పై ఎమ్మెల్యే అనుచరుల విచక్షణారహితంగా దాడి చేశారు.

Mon, 13 May 202406:05 AM IST

అన్నమయ్య జిల్లాలో ఈవిఎంల ధ్వంసం

అన్నమయ్య జిల్లా రాజంపేట ఏరియాలోని పుల్లంపేట మండలం దలువాయిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఘర్షణ జరిగింది. వైసీసీ, టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లోనే ఒకరికొకరు గొడవ పడ్డారు. పోలింగ్ బూత్ లో జరిగిన ఘర్షణలో.. ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి.

పార్టీ కార్యకర్తల మధ్య తోపులాటలో పోలింగ్ బూత్ లోని ఫర్నింగ్ సైతం చెల్లాచెదురు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని లాఠీఛార్జి చేశారు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు కార్యకర్తలు. ఈవీఎంలు ధ్వంసం కావటంతో.. ఓటింగ్ నిలిచిపోయింది. కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

కొత్త ఈవీఎంల ఏర్పాటు తర్వాత గంట ఆలస్యంగా పోలింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. పోలింగ్ బూత్ లో ఈవీఎంల ధ్వంసంపై ఈసీ సీరియస్ అయ్యింది. నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

Mon, 13 May 202406:05 AM IST

ఏపీలో 25శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు దాదాపు 24శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Mon, 13 May 202406:04 AM IST

కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కుమార్తెతో కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి ఓటు వేశారు. 

Mon, 13 May 202405:41 AM IST

తెనాలిలో ఎమ్మెల్యేపై ఓటరు దాడి

తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్‌ సంయమనం కోల్పోయి ఓ ఓటరుపై చేయి చేసుకున్నాడు. దీంతో తిరగబడిన ఓటరు ఎమ్మెల్యేపై ఎదురు దాడి చేశాడు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఓటరును చితకబాదారు. దీంతో తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. 

Mon, 13 May 202405:37 AM IST

నరసరావుపేట ఎమ్మెల్యేపై టీడీపీ ఫిర్యాదు

ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. 

• నరసరావుపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి దేవినేని ఉమా ఫిర్యాదు చేశారు. 

• ఎక్కువ సంఖ్యలో అనుచరులు, వాహనాలతో గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నారని,  సెక్షన్ 144 అమలు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని ఆరోపించారు.  చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినందుకు  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

Mon, 13 May 202405:33 AM IST

మంగళవారంలో ఓటేసిన పవన్ దంపతులు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.  మంగళగిరి నియోజకవర్గం పరిధిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహా కాలనీ, గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 197లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. సతీమణి అనా కొణిదెలకు  భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ సరళిని చూపించారు.

Mon, 13 May 202405:29 AM IST

మాచర్లలో ఉద్రిక్తత

మాచర్ల నియోజకవర్గంలో కంభంపాడులో ఉద్రిక్తత నెలకొంది.  వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో రహదారి పైకి వచ్చి ఆందోళనకు దిగారు.  కంభంపాడులో పరిస్థితిని  ఐజీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారు. 

Mon, 13 May 202404:55 AM IST

రాజమండ్రిలో ఓటు వేసిన పురందేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రిలో ఓటు వేశారు. మంగళగిరిలో  పవన్ కల్యాణ్,  విజయవాడలో  ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా,  గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు,  కిర్లంపూడిలో  ముద్రగడ పద్మనాభం,  సత్తెనపల్లిలో  మంత్రి అంబటి, కన్నా,  శ్రీకాకుళం జిల్లా తొగరాంలో  తమ్మినేని సీతారాం,  గాజువాక మింది గ్రామంలో మంత్రి అమర్నాథ్,  అన్నమయ్య జిల్లా నగిరిపల్లిలో  సీఎం కిరణ్,   విజయవాడ కరెన్సీ నగర్‌లో కేశినేని నాని, శ్రీకాకుళం పెద్దపాడులో  ధర్మాన ప్రసాదరావు,  విశాఖలో జీవీఎల్ నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకన్నారు. 

Mon, 13 May 202404:36 AM IST

ఇడుపులపాయలో ఓటు వేసిన షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో ఓటు వేశారు. అంతకు ముందు వైఎస్సార్‌ ఘాట్ వద్ద భర్తతో కలిసి ప్రార్థనలు చేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల ఇడుపుల పాయలోనీ పోలింగ్ బూత్ నెంబర్ 261లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Mon, 13 May 202404:34 AM IST

మంగళగిరిలో ఓటు వేసిన సజ్జల

ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కాజాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  మంగళగిరి నియోజకవర్గం కాజాలోని పోలింగ్ బూత్ లో  తన కుటుంబ సభ్యులతో కలసి‌వచ్చి క్యూలైన్ లో నిలబడి ಓటు వేశారు. ಓటు హక్కు చాలా విలువైదని సజ్జల‌ అన్నారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ಓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బార్లు తీరడం చాలా ఆనందం కలిగిస్తోందని చెప్పారు. పోలింగ్‌కు తరలి వస్తున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 

Mon, 13 May 202404:32 AM IST

ఏపీలొో 9శాతం పోలింగ్‌

ఏపీలో ఉదయం 9 గంటల వరకు 9శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

Mon, 13 May 202404:08 AM IST

ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపు…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లతో సహా చెల్లించాల్సిన కరవు భత్యం(డిఏ) ఇతర బకాయిల మొత్తాన్ని సోమవారం తెల్లవారు జామునే వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని,  ఇది ఓటర్లను ప్రలోభపెట్టడమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని.  ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని విపక్షాలు ఆరోపించాయి. 

Mon, 13 May 202404:06 AM IST

బాపట్లలో ఉద్రిక్తత

బాపట్ల జిల్లా  నిజాంపట్న మండలం పరిశావారిపాలెంలో ఉద్రిక్తత  చోటు చేసుకుంది.  ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైసీపీ నాయకుల వాగ్వాదం నెలకొంది.  టీడీపీకి ఓటు వేయవద్దంటూ  వైసిపీ నాయకులు అనడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది 

Mon, 13 May 202404:05 AM IST

ఓటేయడానికి రావాలని కిషన్ రెడ్డి పిలుపు

ఓటు హక్కును వినియోగించుకోడానికి ఓటర్లు తరలి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశానని,  ఓటు ప్రాథమిక హక్కు. ఓటు వేసేందుకే ఎన్నికల కమిషన్​ పోలింగ్​ రోజు సెలవు ఇచ్చిందని,  ప్రజలు దీన్ని సాధారణ సెలవుదినంగా పరిగణించ వద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని.  ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండుగ అన్నారు. దేశ అభివృద్ధి, దేశ భద్రత, సంక్షేమం కోసం ఓటు వేయాలన్నారు. ప్రజలందరూ ప్రజస్వామ్య పండుగలో పాల్గొని ఓటు వేయాలి”అని కిషన్ రెడ్డి కోరారు. 

Mon, 13 May 202404:02 AM IST

పల్నాడులో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  కేసనపల్లి గ్రామం లో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకు వెళ్లే విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత నెల్లూరి రామకోటయ్య సహా మరి కొందరికి గాయాలయ్యాయి. ఇరు పక్షాలకు చెందిన పలువురికి  గాయాలయ్యాయి. టీడీపీ  శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

Mon, 13 May 202404:00 AM IST

తెలంగాణలో రెండు గంటల్లో 9.48శాతం పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోంది.  ఉదయం ఆరు గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.  తొలి రెండు గంటల్లో  9.48శాతం పోలింగ్ నమోదైంది. 

Mon, 13 May 202402:58 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం

మంగళగిరి నియోజకవర్గంలో  చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఉండవల్లి గ్రామ పంచాయితీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో  చంద్రబాబు కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో  చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ఓటు వేశారు. 

Mon, 13 May 202402:31 AM IST

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన జగన్

పోలింగ్‍ పై సీఎం జగన్ ట్వీట్  చేశారు.  ప్రజలందరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు.  తప్పకుండా ఓటు వేయాలని కోరారు. మరోవైపు సీఎం జగన్ భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించారు. భార్య, కుమార్తెలతో కలిసి సీఎం జగన్ ఓటు వేశారు. 

Mon, 13 May 202402:21 AM IST

చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

పోలింగ్‌ నేపథ్యంలో  పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  64 వేల మంది టీడీపీ కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు, - పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.  అరాచక పాలనపై ఐదేళ్ల పాటు ఎంతో మంది శ్రమించారని,  నేడు అప్రమత్తంగా ఉండి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.  ఓటమి భయంతో వైసీపీ ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తోందని  ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని,  ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వార్ రూమ్‍కు సమాచారం ఇవ్వాలని సూచించారు.  పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Mon, 13 May 202402:04 AM IST

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం

జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రూ 269.28 కోట్లు నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామన్నారు. మొత్తం 1,06,145 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.

Mon, 13 May 202401:57 AM IST

బారులు తీరిన ఓటర్లు..

ఏపీలో ఉదయం 7గంటలకే  పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం ఆరు గంటల నుంచి చాలా చోట్ల ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.

Mon, 13 May 202401:56 AM IST

లక్షమందితో ఎన్నికల భద్రత

ఎన్నికల నేపథ్యంలో ఏపీలో 1,06,145 మంది సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో  సివిల్‌ పోలీసులతో పాటు  (ఏపీ,  కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర పోలీసులను వినియోగిస్తున్నారు.  హోమ్‌గార్డులు ఇతర విభాగాలకు 58,948 మంది ఏపీఎస్పీ, కేంద్ర సాయుధ భద్రతా బలగాలు 28,588 మంది  ఉన్నారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, మాజీ సైనికులు, విశ్రాంత పోలీసు ఉద్యోగులు తదితరులు  18,609 మంది ఉన్నారు. 

Mon, 13 May 202401:42 AM IST

ఏపీలో భారీగా అభ్యర్థులు

రాష్ట్రంలోని  175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో  2,387 మంది పురుషులు, 2,154 మహిళలు,  231 మంది ఇతరులు 2 ఉన్నారు.   తిరుపతిలో- 46 మంది, మంగళగిరిలో 40 మంది పోటీలో ఉన్నారు.  అతి తక్కువ మంది పోటీలో ఉన్న స్థానంగా  చోడవరం నిలిచింది.  ఆరుగురు మాత్రమే చోడవరంలో పోటీ చేస్తున్నారు.  25  లోక్‌సభ నియోజకవర్గాల్లో 454 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో పురుషులు  417 మంది, మహిళలు  37 మంది ఉన్నారు.   విశాఖపట్నం లోక్‌సభ పరిధిలో 33 మంది, నంద్యాలలో  31మంది, గుంటూరులో  30 మంది పోటీలో ఉన్నారు.  రాజమహేంద్రవరంలో అతి తక్కువగా  12 మంది పోటీ చేస్తున్నారు. 

Mon, 13 May 202401:30 AM IST

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పరస్పరం  దాడులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు, మరో ఇద్దరు టీడీపీ కార్యకర్తలఫై దాడి చేసి  వైసీపీ నాయకులు గాయపరిచారని టీడీపీ ఆరోపించింది. ఓటమి భయంతో వైసీపీ హింసకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.  దాడికి పాల్పడిన వైసీపీ మూకలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Mon, 13 May 202401:25 AM IST

ఏపీలో నాలుగు కోట్ల మంది ఓటర్లు

ఏపీలో 25  లోక్‍సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు బరిలో 2,387 మంది అభ్యర్థులు, 25 లోక్‍సభ స్థానాలకు  454 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.   అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ బరిలో 46 మంది పోటీ చేస్తున్నారు.  అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ బరిలో ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు.  ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో  పురుషులు 2,03,39,851 మంది,  మహిళలు-2,10,58,615 మంది ఉన్నారు. 

Mon, 13 May 202401:23 AM IST

తెలంగాణలో  35,089 కేంద్రాల్లో పోలింగ్

తెలంగాణలో 17 ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్  నిర్వహిస్తున్నారు.  106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. 13 సమస్యాత్మక సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.  61 పోలింగ్ కేంద్రాల్లో పది మందిలోపు మాత్రమే ఓటర్లు ఉన్నారు.   తెలంగాణలో 17 లోక్‍సభ స్థానాలకు బరిలో 525 మంది పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‍కు నేడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. 

Mon, 13 May 202401:20 AM IST

ఏపీలో 46,389 కేంద్రాల్లో పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో 46,389 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.  అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4.30 వరకు పోలింగ్ జరుగుతుంది.  పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తారు.  ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.  34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు.  ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది ఉన్నారు. 

Mon, 13 May 202401:18 AM IST

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం  7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది.