Zomato Everyday: జొమాటోలో ‘ఇంటి’ భోజనం.. కొత్త సర్వీస్ ప్రారంభం-zomato launches new service called everyday for home cooked meals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Everyday: జొమాటోలో ‘ఇంటి’ భోజనం.. కొత్త సర్వీస్ ప్రారంభం

Zomato Everyday: జొమాటోలో ‘ఇంటి’ భోజనం.. కొత్త సర్వీస్ ప్రారంభం

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 22, 2023 07:16 PM IST

Zomato Everyday: ఎవ్రీడే పేరుతో జొమాటో కొత్త సర్వీస్‍ను ప్రారంభించింది. ఇళ్లలో వండిన భోజనాన్ని కస్టమర్లకు ఈ సర్వీస్ ద్వారా డెలివరీ చేయనుంది. ప్రస్తుతం గురుగ్రామ్‍లోని కొన్ని ఏరియాల్లో దీన్ని తీసుకొచ్చింది.

Zomato Everyday: జొమాటోలో ‘ఇంటి’ భోజనం.. కొత్త సర్వీస్ ప్రారంభం
Zomato Everyday: జొమాటోలో ‘ఇంటి’ భోజనం.. కొత్త సర్వీస్ ప్రారంభం (REUTERS)

Zomato Everyday: ఫుడ్ డెలివరీ ప్లాట్‍ఫామ్ జొమాటో (Zomato) సరికొత్త సర్వీస్‍ను లాంచ్ చేసింది. ‘ఎవ్రీడే’ (Zomato Everyday) పేరుతో దీన్ని ప్రారంభించింది. ఇళ్లలో వండిన ఆహారాన్ని ఈ సర్వీస్ ద్వారా డెలివరీ చేయనుంది. అంటే రెస్టారెంట్లలో కాకుండా ఇళ్లలో తయారు చేసిన ఫుడ్‍ను కస్టమర్లకు చేరవేస్తుందన్న మాట. తక్కువ ధరలో ఈ ఆహార పదార్థాలు ఉంటాయని జొమాటో పేర్కొంది. ప్రస్తుతం గురుగ్రామ్‍ సిటీలోని కొన్ని ఏరియాల్లో ఈ ఎవ్రీడే సర్వీస్‍ను జొమాటో ప్రారంభించింది. ఇక్కడ విజయవంతమైతే మరిన్ని సిటీలకు విస్తరించారని ప్లాన్ చేసుకుంది. పూర్తి వివరాలివే..

వీరి కోసం..

Zomato Everyday: ఇళ్లకు దూరంగా ఉంటూ.. ఇంటి భోజనం తినాలని అనుకునే వారికి ఈ జొమాటో ఎవ్రీడే సర్వీస్ ఉపయోగపడుతుందని జొమాటో పేర్కొంది. ప్రస్తుతానికి గురుగ్రామ్‍లోని కొన్ని ఏరియాల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్టు బ్లాగ్‍లో వెల్లడించింది. “అందుబాటు ధరలోనే ఇంటి భోజనాన్ని మీ దగ్గరికే డెలివరీ చేసే సర్వీస్‍ను అనుభూతి చెందండి” అని జొమాటో సీఈవో, ఫౌండర్ దీపీందర్ గోయల్ (Deepinder Goyal) ట్వీట్ చేశారు. ‘ఎవ్రీడే’లో ఫుడ్ ఐటెమ్స్ ధరలు రూ.89 నుంచి ప్రారంభం అవుతాయని జొమాటో పేర్కొంది.

ఎవ్రీడే సర్వీస్ ఇలా..

Zomato Everyday: “ఇళ్లలో వంట చేసే వారితో మా ఫుడ్ పార్ట్నర్స్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటారు. ఇళ్లలో వండే వారు ప్రతీ ఫుడ్ ఐటెమ్‍ను ఎంతో ప్రేమ, జాగ్రతతో తయారు చేస్తారు. ఈ బెస్ట్ ఫుడ్ నిమిషాల్లో మీ ముందు ఉంటుంది. మంచి పదార్థాలతో ఈ ఆహారాన్ని వండుతారు. దీంతో ఫుడ్ మంచి టేస్టీగా మాత్రమే కాకుండా నాణ్యతలో కూడా అత్యుత్తమంగా ఉంటుంది” అని బ్లాగ్ పోస్టులో జొమాటో పేర్కొంది. అంటే కొన్ని ఇళ్లతో జొమాటో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఇళ్లలో తయారు చేసిన ఫుడ్‍ను కస్టమర్లకు డెలివరీ చేస్తుంది.

Zomato Everyday: ఈ సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో.. జొమాటో యాప్‍లోనే ఎవ్రీడే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‍లోకి వెళ్లి ఆ తర్వాత మెనూను బ్రౌజ్ చేసి ఇష్టమైన ఫుడ్ ఐటమ్‍లను ఆర్డర్ చేయవచ్చు. ఆ తర్వాత ఇళ్లలో వండిన ఆ ఫుడ్‍ను జొమాటో ఏజెంట్లు డెలివరీ చేస్తారు.

ఈ ఏడాది జనవరిలో మెంబర్‌షిప్ ప్రొగ్రామ్ జొమాటో గోల్డ్‌ను ఆ సంస్థ మళ్లీ తీసుకొచ్చింది. మూడు నెలలకు రూ.249తో ఈ సర్వీస్‍కు సబ్‍స్క్రైబ్ చేసుకుంటే.. కొన్ని అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి. 10 కిలోమీటర్లలోపల ఉన్న ఏ రెస్టారెంట్ నుంచైనా ఉచిత డెలివరీ పొందవచ్చు. అలాగే చెప్పిన సమయానికి డెలివరీ కాకపోతే రూ.100 కూపన్ లాంటి సదుపాయాలు ఈ సబ్‍స్క్రిప్షన్ ద్వారా లభిస్తాయి. ఈ సర్వీస్ జొమాటో అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో గోల్డ్ సబ్‍స్రిప్షన్ ప్లాన్ ఉంటుంది.

Whats_app_banner