Vivo Y02 launched: 5000mAh బ్యాటరీతో వివో నుంచి బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ లాంచ్-vivo y02 launched in indonesia may come to india soon know price specifications details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo Y02 Launched: 5000mah బ్యాటరీతో వివో నుంచి బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ లాంచ్

Vivo Y02 launched: 5000mAh బ్యాటరీతో వివో నుంచి బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ లాంచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 06:41 AM IST

Vivo Y02 launched: వివో వై02 మొబైల్ వచ్చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్‍లో అడుగుపెట్టిన ఈ ఫోన్.. ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇవే.

Vivo Y02 launched: 5000mAh బ్యాటరీతో వివో నుంచి బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ లాంచ్ (Photo: Vivo)
Vivo Y02 launched: 5000mAh బ్యాటరీతో వివో నుంచి బడ్జెట్ రేంజ్‍లో మొబైల్ లాంచ్ (Photo: Vivo)

Vivo Y02 launched: బడ్జెట్ రేంజ్‍లో వివో కొత్త ఫోన్‍ను లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్‍లో వివో వై02 విడుదలైంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఈ ఫోన్ అడుగుపెట్టింది. భారత్‍లో ఎప్పుడు లాంచ్ చేసేది వివో చెప్పలేదు. అయితే త్వరలో ఈ ఫోన్ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ రేంజ్‍లో స్పెసిఫికేషన్ల పరంగా వివో వై02 మోస్తరుగా ఉన్నా.. డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. వై01కు సక్సెసర్‍గా ఈ వివో వై02 అడుగుపెట్టింది. అయితే వై02ఎస్ కంటే కాస్త తక్కువ స్థాయి స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. వివో వై02 పూర్తి వివరాలు ఇవే.

వివో వై02 ధర

Vivo Y02 Price: వివో వై02 ప్రస్తుతం ఇండినేషియాలో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర 14,99,000 ఇండోనేషియన్ రూపీయాలు (భారత కరెన్సీలో సుమారు రూ.7,800) గా ఉంది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‍లలో లాంచ్ అయింది. ఒకవేళ ఈ ఫోన్ ఇండియాలో విడుదలైతే రూ.8,000 ధరతోనే అందుబాటులోకి వస్తుంది.

వివో వై02 స్పెసిఫికేషన్లు

Vivo Y02 Specifications: 6.51 ఇంచుల హెచ్‍డీ+ ఫుల్‍వ్యూ డిస్‍ప్లేను వివో వై02 కలిగి ఉంది. ఐ ప్రొటెక్షన్ ఫీచర్ ను ఈ స్క్రీన్‍కు ఇచ్చినట్టు వివో పేర్కొంది. అయితే ఈ ఫోన్‍లో ఏ ప్రాసెసర్ పొందుపరిచిన విషయాన్ని ఆ కంపెనీ చెప్పలేదు. మీడియాటెక్ పీ22 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉన్నట్టు తెలుస్తోంది. 3జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్‍ను పొడిగించుకునేందుకు మైక్రో ఎస్‍‍డీ కార్డ్ స్లాట్ కూడా ఈ ఫోన్‍లో ఉంటుంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‍టచ్ ఓఎస్ 12పై వివో వై02 స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక 8 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఒకే కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వివో ఇచ్చింది.

వివో వై02 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. స్టాండర్డ్ 10 వాట్ల చార్జింగ్‍కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ వస్తుంది.

Whats_app_banner