Vivo V40e: త్వరలో భారత్ లో వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..-vivo v40e launching soon in india check out the confirmed specs and features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V40e: త్వరలో భారత్ లో వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..

Vivo V40e: త్వరలో భారత్ లో వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే..

Sudarshan V HT Telugu
Sep 19, 2024 06:33 PM IST

భారతదేశంలో వీ 40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ పై వివో కీలకమైన అప్ డేట్ ఇచ్చింది. ఈ నెలలోనే ఈ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లోని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు మీ కోసం..

త్వరలో భారత్ లో వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్
త్వరలో భారత్ లో వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ (Vivo)

భారతదేశంలో వివో వీ 40 సిరీస్ లాంచ్ తర్వాత, కంపెనీ రాబోయే రోజుల్లో భారత్ లో మరొక మోడల్ వివో వీ 40 ఇ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా రాబోయే వివో స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీకులు, పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పుడు వివో వీ 40 ఇ త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండనున్న కొన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కూడా వెల్లడించింది.

వివో వి 40 ఇ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

వివో (vivo) రాబోయే వివో వి 40ఇ కోసం ప్రత్యేక మైక్రోసైట్ ను రూపొందించింది. భారతదేశంలో ఈ స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ స్మార్ట్ఫోన్ లోని కొన్ని స్పెసిఫికేషన్లను వివో వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ 0.749 సెంటీమీటర్ల మందం, 183 గ్రాముల బరువుతో స్లిమ్ ప్రొఫైల్ తో వస్తుంది. వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్ లో 6.77 అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది . డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్లను కూడా వివో వెల్లడించింది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, 2ఎక్స్ పోర్ట్రెయిట్ మోడ్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఐ-ఏఎఫ్ కెమెరా కూడా ఉండనుంది.

వివో వి 40ఇ ఇతర ఫీచర్లు

వివో వి 40ఇ స్మార్ట్ ఫోన్ (smartphone) లో 8 జిబి ర్యామ్, 256 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ ఉంటుందని పుకార్లు సూచిస్తున్నాయి. అదనంగా, వివో వీ 40 ఇ లో 4500నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, వివో వి 40ఇ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. అవి రాయల్ బ్రాంజ్, మింట్ గ్రీన్. వివో వీ40ఈ స్మార్ట్ ఫోన్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ (smart phones launch) 98 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 20 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్ ను అందిస్తుందని వివో పేర్కొంది.