Vivo V30 discount: వివో వీ 40 లాంచ్ కు ముందు వివో వీ 30 సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం-vivo v30 series gets a massive discount ahead of vivo v40 launch this week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo V30 Discount: వివో వీ 40 లాంచ్ కు ముందు వివో వీ 30 సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Vivo V30 discount: వివో వీ 40 లాంచ్ కు ముందు వివో వీ 30 సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 03:08 PM IST

ఆగస్టులో వివో వీ 40 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో ఈ వారమే లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో వీ 30 సిరీస్ ధరలను వివో గణనీయంగా తగ్గించింది. వివో వీ30 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ ఉంటుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఉంటుంది.

వీ 30 సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్
వీ 30 సిరీస్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్

వివో తన కెమెరా ఫోకస్డ్ మిడ్ రేంజ్ వివో వీ 40 సిరీస్ ను ఆగస్టు 7 న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ విడుదలకు ముందు, వివో ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో వీ 30 సిరీస్ ఫోన్లపై గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. అయితే, ఇప్పుడు, డిస్కౌంట్ లో వివో వి 30 ని కొనడం బెటరా? లేక లేటెస్ట్ వివో వీ 40 ని ఎంచుకోవడం బెటరా? అన్న ప్రశ్న తలెత్తింది.

వివో వీ30 స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్స్

వివో వీ30 (Vivo V30) స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999 గానూ, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999 గానూ, 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గానూ నిర్ణయించారు. డిస్కౌంట్ అనంతరం వీ30 8 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ.31,999, 8 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.33,999, 12 జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.35,999 గా మారింది. కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, వివో (Vivo) సొంత వెబ్ సైట్, కొన్ని రిటైల్ అవుట్ లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

వివో వీ30 స్పెసిఫికేషన్లు

వివో వీ30లో 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, హెచ్ డీ ఆర్10+ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే, ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. వివో వీ 30 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఐపీ 54 డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉంది.

స్నాప్ డ్రాగన్ 7 జెన్ 30 ప్రాసెసర్ తో..

వివో వీ30 లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 7 జెన్ 30 ప్రాసెసర్, అడ్రినో 720 జీపీయూతో జత చేయబడింది. 12 జీబీ వరకు LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో అందించారు. కెమెరా విషయానికొస్తే, వివో వీ30 లో ఓఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. డ్యూయల్ సాఫ్ట్ ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్ తో ముందువైపు 50 మెగాపిక్సెల్ ఎఫ్/2.0 సెన్సార్ ను అందించారు. ప్రీమియం లుక్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అందుబాటు ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి వివో వీ 30 సిరీస్ ఫోన్లు మంచి ఎంపిక అవుతుంది.