Trai new rules : ఇక డీఫాల్ట్​గా ‘కాలర్​ ఐడీ’ ఫీచర్​- ఎవరు ఫోన్​ చేసినా పేరు వచ్చేస్తుంది!-trais new rules will mandate telcos to identify callers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Trai New Rules : ఇక డీఫాల్ట్​గా ‘కాలర్​ ఐడీ’ ఫీచర్​- ఎవరు ఫోన్​ చేసినా పేరు వచ్చేస్తుంది!

Trai new rules : ఇక డీఫాల్ట్​గా ‘కాలర్​ ఐడీ’ ఫీచర్​- ఎవరు ఫోన్​ చేసినా పేరు వచ్చేస్తుంది!

Sharath Chitturi HT Telugu
Feb 24, 2024 06:40 AM IST

Trai caller identification feature : టెలికాం ఆపరేటర్లు.. కాలర్​ ఐడెంటిఫికేషన్​ ఫీచర్​ని డిఫాల్ట్​గా అందివ్వాలని సిఫార్సు చేసింది ట్రాయ్​. ఇది ట్రూకాలర్​కు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు!

ఇక డీఫాల్ట్​గా కాలర్​ ఐడీ ఫీచర్​- ఎవరు ఫోన్​ చేసినా పేరు వచ్చేస్తుంది!
ఇక డీఫాల్ట్​గా కాలర్​ ఐడీ ఫీచర్​- ఎవరు ఫోన్​ చేసినా పేరు వచ్చేస్తుంది! (Bloomberg )

Default caller identification feature : దేశీయ టెలికమ్యూనికేషన్ నెట్​వర్క్స్​లో.. కాలర్ ఐడెంటిఫికేషన్ (కాలర్ ఐడీ)ని డిఫాల్ట్ ఫీచర్​గా ప్రవేశపెట్టాలంటూ.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తుది సిఫార్సులను శుక్రవారం విడుదల చేసింది. వినియోగదారుల అభ్యర్థన మేరకు.. అన్ని టెల్కోలు.. కాలింగ్​ నేమ్​ ప్రెజెంటేషన్​ (సీఎన్​ఏపీ)ని ఒక అనుబంధ సేవగా అందించాలని.. సిఫార్సులు చేసింది ట్రాయ్​.

కొత్త రూల్​ ఎలా పనిచేస్తుంది?

కాలర్ ఐడెంటిఫికేషన్​ని అమలు చేయడానికి ఒక సాంకేతిక నమూనాను కేంద్రానికి వివరించింది ట్రాయ్. అన్ని టెల్కోలు నిర్దిష్ట సమయంలో సేవలను ప్రారంభించడానికి ఉత్తర్వులు జారీ చేయాలని రెగ్యులేటరీ బాడీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సీఎఏపీ మోడల్​లో భారతదేశంలో ఫోన్ కాల్ వచ్చినప్పుడు.. టెలికాం ఆపరేటర్ వద్ద ఏ నంబర్ రిజిస్టర్ చేసి ఉంటుందో.. అది స్క్రీన్​పై కనిపిస్తుంది! అయితే.. ఇది.. యూజర్లకు ఆన్​ రిక్వెస్ట్ ఫీచర్​గా అందుబాటులో ఉండొచ్చని సమాచారం.

ఈ సేవలను ప్రవేశపెట్టాలని మార్చి 2022 ప్రతిపాదన చేసింది డాట్​ (టెలికాం విభాగం). ట్రాయ్​.. 2022 నవంబర్​లో సీఎన్ఏపీ కోసం సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనికి సంబంధించి గత ఏడాది మార్చిలో సంప్రదింపులు జరపగా, తుది సిఫార్సులను తాజాగా విడుదల చేశారు.

Trai new rules : సిఫార్సుల విడుదలతో డిఫాల్ట్ కాలర్ ఐడీ సేవలను ప్రవేశపెట్టడానికి ఒక ముందడుగు పడింది. ఈ ఫీచర్ లాంచ్ అయిన తరువాత, ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ ప్రొవైడర్లతో పోటీపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రూకాలర్​.. వినియోగదారుల కోసం యాడ్-సపోర్ట్, సబ్స్క్రిప్షన్ మోడల్​గా పనిచేస్తుంది.

ట్రాయ్ సిఫార్సులపై టెలికాం ఆపరేటర్లు ఇంకా స్పందించలేదు.

"సీఎన్​ఏపీకి సంబంధించి, ఇది మా 374 మిలియన్లకు పైగా వినియోగదారులకు ట్రూకాలర్ అందించే పూర్తి స్థాయి సేవలు, కార్యాచరణతో పోల్చదగిన పోటీ ఇస్తుందని మేము చూడటం లేదు. మా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో ట్రూకాలర్ కేవలం బేసిక్ నంబర్ ఐడెంటిఫికేషన్ సర్వీస్​కు మించిన సేవలను అందుస్తుంది,' అని ట్రూకాలర్ ప్రతినిధి తెలిపారు.

Calling Name Presentation : ట్రూకాలర్ భారత యూజర్ బేస్ పై కూడా ఈ ఫీచర్ కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ఏదేమైనా, ఈ ఏడాది చివర్​లో డీపీడీపీ నిబంధనల నోటిఫికేషన్ తరువాత ప్రవేశపెట్టబోయే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డిపిడిపి) చట్టం, 2023కు అనుగుణంగా వాణిజ్య కాలర్ ఐడెంటిఫికేషన్ సేవలను అందించడం దేశవ్యాప్తంగా ఎలా అమలు అవుతుందో వేచి చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం